Vishnu Vs Siddarth : అమెరికా పౌరుడికి భారత అంతర్గత విషయాలెందుకు ? మరో సారి విష్ణువర్ధన్ రెడ్డి వర్సెస్ సిద్ధార్థ్
సోషల్ మీడియాలో మరోసారి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, నటుడు సిద్ధార్ధ్ మధ్య వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. సిద్ధార్థ్ అమెరికా పౌరుడని భారత అంతర్గత విషయాలెందుకని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
Vishnu Vs Siddarth : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో ఒకరు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి. బీజేపీ విధానాలు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఆయన ధీటైన సమాధానం చెబుతూ ఉంటారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన హీరో సిద్ధార్థ్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆయన భావజాలం ఫక్తు భిన్నం. పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ కొత్త భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం ఎదుట హిందూ పద్దతిలో పూజలు చేయడాన్ని ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ఒక వేళ ఉప రాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఉండి ముస్లిం పద్దతిలో పూజలు చేసినట్లయితే బీజేపీ నేతలు ఎలా స్పందించేవారోనని ఆయన ట్వీట్ చేశారు.
All those who had no problem with @NarendraModi inaugurating an official emblem with (Hindu) prayers, answer this: If Hamid Ansari—as Rajya Sabha chair—had inaugurated the same with (Muslim) prayers, how would you have reacted?
— Siddharth (@svaradarajan) July 12, 2022
And be honest, for once in your miserable lives!
ఈ ట్వీట్‌కు విష్ణువర్దన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసలు సిద్ధార్త్ ఇండియన్ సిటిజన్ కాదని అందిరకీ తెలిసిపోయేలా ట్వీట్ చేశారు. ఈ అమెరికా పౌరుడిగా భారత అంతర్గత విషయాలపై అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడ్ని బైబిల్ పట్టుకోవడంపై ఎప్పుడైనా ప్రశ్నించారా అని కౌంటర్ ఇచ్చారు.
I don’t understand why this American gentleman is so much interested in our internal matter.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 12, 2022
Did we ever question your presidents taking oath on Holy Bible? https://t.co/pPL6MssRRa
దీనికి సిద్ధార్థ్ కూడా రిప్లయ్ ఇచ్చారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంపై కాకుండా తాను వేసిన సింపుల్ ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన రిప్లయ్ ఇచ్చారు.
I don’t understand why you can’t answer the simple question I asked, Vishnu Reddy.
— Siddharth (@svaradarajan) July 12, 2022
సిద్ధార్ధ్ , విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య ట్విట్టర్ వాగ్వాదం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ఓ సారి ఇలాగే బీజేపీపై సిద్ధార్త్ విమర్శలు చేసినప్పుడు సిద్దార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఖండించిన సిద్ధార్థ్ తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్ను కడుతున్నానని, వెళ్లి పడుకో విష్ణు.. ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు ఉండాల్నారు. అయితే అయితే ఇప్పుడు సిద్ధార్థ్ అమెరికా పౌరుడని విష్ణువర్దన్ రెడ్డి చెుతున్నారు. దానికి నేరుగా సిద్ధార్థ్ సమాధానం చెప్పలేదు.
సిద్ధార్థ్ వివాదాస్పద ట్వీట్లతో పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది రోజుల కింట హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్‌పై అనుచిత ట్వీట్ చేయడంతో క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.