తెలంగాణ మంత్రులు నిర్వహించిన ప్రభుత్వ సమీక్షా కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ కనిపించారు. రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి శనివారం పర్యటక శాఖపై ఓ సమీక్ష నిర్వహించారు. వికారాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్‌లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధిపై వీరు చర్చించారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్ కుమార్ ఈ అడ్వెంచర్స్ టూరిజం, వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుపై రూపొందించిన పలు ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
అనంతగిరిలో ఏర్పాటు చేయబోతున్న అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని టూరిజం అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రాజెక్టు రిపోర్ట్‌ను తయారు చేయాలని మంత్రులు టూరిజం ఎండీ మనోహర్‌ను ఆదేశించారు.
అనంతగిరి హిల్స్‌లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ అడ్వెంచర్ ప్రాజెక్టులో ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టేందుకు ముందు రానున్నట్లుగా మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అయితే, మంచు మనోజ్ ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రతిపాదనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ప్రాజెక్టులో ఆయన కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
In Pics : సిరిసిల్లకు కొత్త హంగులు, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం అందుబాటులోకి
In Pics: తెలంగాణలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఎలా ఉందో చూడండి - ఫోటోలు
In Pics : వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, హాజరైన రాహుల్ గాంధీ
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
Roja Met KCR & Chiru: కెసిఆర్, మెగాస్టార్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు