రియల్‌మీ సబ్ బ్రాండ్ డిజో (Dizo) నుంచి వాచ్ 2, వాచ్ 2 ప్రో ఇండియాలో విడుదల కానున్నాయి. ఈ రెండు వాచ్‌లను ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
రియల్‌మీ డిజో వాచ్ 2లో 1.69 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. రియల్‌మీ డిజో వాచ్ 2 ప్రోలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ లెవల్ (SpO2) లను మానిటర్ చేసే ఫీచర్లు అందించారు.
రియల్‌మీ డిజో వాచ్ 2 ధర రూ.3000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. వాచ్ 2 ప్రో ధర ఎంత ఉంటుందనే వివరాలు తెలియరాలేదు.
వీటిలో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. 50m వరకు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇన్‌బిల్ట్ డ్యూయల్ జీపీఎస్, గ్లోనాస్ (GLONASS) సపోర్టుతో రానున్నాయి.
డీజో తన మొట్టమొదటి వాచ్‌ని (రియల్‌మీ డిజో) ఈ ఏడాది ఆగస్టులో మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3,499గా ఉంది. ఇందులో 90 స్పోర్ట్స్ మోడ్స్, లైవ్ వాచ్ ఫేసెస్, SpO2, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
Neha Kakkar Photos: వైట్ డ్రెస్‌లో మల్లెపువ్వులా సింగర్ నేహా కక్కర్
In Pics: సరికొత్త లుక్ తో 'హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్'.. ఇది చాలా స్పెషల్ గురూ!
WhatsApp: వాట్సాప్‌లో కొంతమందికి మాత్రమే మన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ కనిపించేలా ఫీచర్ !
Realme Android 11: రియల్‌మీ 6, 6ఐ, 6ఎక్స్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్
Flipkart Carnival Sale: ఫ్లిప్‌కార్ట్‌లో కార్నివాల్ సేల్.. ఐఫోన్ 12పై రూ.13 వేల వరకు డిస్కౌంట్..
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం