అన్వేషించండి
Vinesh Phogat: వినేష్ ఫొగాట్ జీవితం నుండి నేర్చుకోవలసిన ముఖ్య అంశాలివే
Vinesh Phogat:వినేశ్ ఫొగాట్, ఇప్పుడు క్రీడాప్రపంచంలో మార్మోగుతున్న పేరు. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.కానీ అధికబరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. అయినా ఆమె ఎందరికో స్ఫూర్తి

వినేష్ ఫోగట్ (ఫోటో PTI)
1/10

గత రెండు ఒలింపిక్స్‌లో కనీసం క్వార్టర్స్ దాటలేదు. అయినా వినేశ్ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. తాను సాధిస్తానని బలంగా నమ్మింది. ఆ నమ్మకంతోనే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.
2/10

53 కేజీల విభాగం నుంచి 50 కేజీల విభాగంలో పోటీ పడాలని వినేశ్ భావించింది. దాని కోసం బరువు తగ్గాలని భావించింది. బరువు తగ్గితే ప్రాణాపాయం అని వైద్యులు చెప్పినా అడుగు తన లక్ష్యం దిశగానే వేసింది. మడమ తిప్పలేదు.
3/10

వినేష్ తన జీవితాన్ని తానే నిర్మించుకుంది. కష్టాలకు భయపడి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జంతర్ మంతర్ రోడ్లపైన అయినా.. ఒలింపింక్స్‌లో అయినా పోరాడింది.
4/10

వినేశ్ ఫొగాట్ విజయంలో కీలకపాత్ర పోషించిన అంశం క్రమశిక్షణ. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వినేష్ తన ప్రాక్టీస్, కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. క్రమశిక్షణలో చిన్న లోపం కూడా రానివ్వరు
5/10

వినేష్ మారుమూల గ్రామం నుంచి వచ్చింది. అయినా ఒలింపిక్ పతకం సాధించాలన్న పెద్ద కల కనింది. దానిని నెరవేర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. భవిష్యత్ తరాలు కూడా ఇలాంటి కలలు కనాలి. వాటిని సాధించేందుకు పోాడాలి.
6/10

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, పోలీసుల లాఠీ దెబ్బలు కూడా వినేశ్ అత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. వినేష్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదల్లేదు.
7/10

ఆడపిల్లలకు క్రీడలు ఎందుకు అన్న మాటలు వినిపించినా ఆ మాటలకు వినేశ్ భయపడలేదు. చాలామంది అమ్మాయిలను క్రీడల్లో ఎదిగేందుకు స్ఫూర్తిగా నిలిచింది.
8/10

వెయ్యి అసమానతలు ఉన్నా వినేశ్ వెనక్కి తగ్గలేదు. తన పోరాటం భవిష్యత్ తరాల కోసమే అని స్పష్టంగా ప్రకటించింది.
9/10

ఒలింపిక్స్‌లో పతకాన్ని నిలబెట్టుకునేందుకు వినేశ్ చేయాల్సిందంతా చేసింది. చివరికి రక్తం కూడా తీయించుకుంది. ఫలితం ఎలా ఉన్నా చివరి వరకూ మాత్రం పోరాడింది.
10/10

తనపైన తనకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే తాను తప్పక ఒలింపిక్స్‌లో సాధిస్తానని వినేశ్ బలంగా నమ్మింది.
Published at : 08 Aug 2024 12:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion