పట్టిసీమ నుంచి కొవ్వూరు వరకూ గోదావరి తీరంలో ఎక్కడా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లేదు. అదే విషయంపై చర్చించిన పాతపట్టిసీమకు చెందిన కొందరు మహిళలు వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిద్దామని గ్రామస్తులతో చర్చించారు.
డి కట్టడం మాటలా లక్షల రూపాయలు ఖర్చవుతుంది ఆడోళ్లు మీరేం చేస్తారని హేళన చేశారు. ఆ హేళనకి కుంగిపోలేదు..అడుగు ముందుకేయాల్సిందే అని మరింత గట్టిగా ఫిక్సయ్యారు.
2018డిసెంబర్ 15వ తేదిన ఆలయ నిర్మాణానికి శంకుస్దాపన చేశారు. ఆరోజు నుంచి ఇంటి పనులూ ,పొలం పనులు చేసుకుంటూనే ఉభయగోదావరి జిల్లాల్లో విరాళాలు సేకరించారు. ఎవరికి తోచినంత సాయం వాళ్లు చేశారు. మూడేళ్లలో కోటి రూపాయలు విరాళం సేకరించారు.
2018 లో మొదలుపెట్టి మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు. ఫిబ్రవరి 11న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠను కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుత్మంతుల విగ్రహాలని ప్రతిష్ఠించారు.
ఈ పూజల సందర్భంగా గ్రామ యువత, పెద్దలూ ముందుకు వచ్చి నాలుగు రోజులు అన్నసమారాధన చేశారు. ఆఖరి రోజున గ్రామం మొత్తం ఏకమై వేలాది మందికి భోజనాలు పెట్టారు.
ఆడవాళ్లు మీవల్ల ఏమవుతుంది అన్నవారికి.... తలుచుకుంటే తాము ఏపనైనా చేయగలం అని నిరూపించి చూపించారు. ఆ రోజు హేళన చేసిన నోర్లే ఇప్పుడు ఆడవాళ్లూ మీకు జోహార్లు అంటున్నాయ్.
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి చక్రస్నానం
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు