'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. అక్కినేని హీరో సుశాంత్ తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మీను పాత్రలో అందరినీ ఆకట్టుకుంది.
ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకముందే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది మీనాక్షి. 'ఖిలాడి' చిత్రంలో డింపుల్ హయాతి ఒక హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించింది. ఇందులో రవితేజకు లిప్ లాక్ ఇచ్చి అందరినీ ఆకర్షించింది.
అయితే మీనాక్షి తెలుగులో హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినప్పటికీ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. నాని నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2' మూవీలో నటించింది. ఈ చిత్రం ఆమెకు బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూపించింది.
ఈ క్రమంలో మీనాక్షి చౌదరి కోలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అయింది. ప్రస్తుతం 'కోలై' అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలానే విశ్వక్ సేన్ కు జోడీగా #VS10 చిత్రంలోనూ నటిస్తోంది.
ఎఫ్బీబీ క్యాంపస్ ప్రిన్సెస్-2018 టైటిల్ విన్నర్ అయిన మీనాక్షీ.. అదే యేడాది ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా-2018 మరియు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018 అందాల పోటీలలో మొదటి రన్నరప్ గా నిలిచింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా సముద్ర తీరాన హాట్ ట్రీట్ ఇచ్చింది మీనాక్షీ. టైట్ టీ షర్ట్ లో అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Bhanu Shree Photos: భానుశ్రీ స్టైలిష్ పిక్స్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
Priya Prakash Varrier: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియా
Anasuya Bhardwaj: చీరలో హొయలు పోతున్న అనసూయ అందాల కనువిందు
Rukshar Dhillon Photos: రుక్సర్ థిల్లాన్ క్యూట్ పిక్స్
పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి
Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి
విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!
Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్