Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
BC Reservation in Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వేంకటేశ్వర రావుని చైర్మన్గా జీవో జారీ అయింది.
Telangana Government constitutes dedicated commission on BC quota for local body polls
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservation)కు సంబంధించి న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా తెంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూచనల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర రావుని కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ కమిషన్ నెల రోజుల్లోగా సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (IFS) కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల (Reservations) కు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువడుతున్నందున పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం 24 గంటల్లోగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం తెలిసిందే. బీసీల్లో వెనుకబాటు తనం, సమకాలీన అంశాలపై డెడికేటెడ్ కమిషన్ (BC Reservation Commission) సమాచారం కోసం బీసీ కమిషన్ వివరాలతో పాటు వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకోవచ్చు.
తెలంగాణ రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే
నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అవుతుంది. ఇందుకోసం టీచర్లకు శిక్షణ ఇచ్చామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. సమగ్ర సర్వే పూర్తయ్యే వరకు ఒక్క పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం స్కూల్లో వర్క్ చేసి, మధ్యాహ్నం నుంచి టీచర్లు, హెడ్మాస్టర్లు, ఇతర సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
Also Read: KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ