Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Pawan kalyan: విపక్ష పాత్ర కూడా కూటమినే పోషించే ప్లాన్ ను పవన్ అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వైసీపీ పవన్ క ఒరియంటేషన్ క్లాసులు పెట్టాలని వ్యాఖ్యానిస్తోంది.
Is Pawan implementing a plan to play the role of the opposition as well: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోలీసుల పనితీరుపై, హోంమంత్రి అనిత పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఎందుకు పవన్ కల్యాణ్ ఇలా వ్యాఖ్యానించారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ సొంత ప్రభుత్వంపై ఇలా వ్యాఖ్యానించారంటే బలమైన కారణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కారణం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. రాజకీయ పరమైన కారణాల ప్రకారం చూస్తే పవన్ వ్యూహాత్మకంగానే ఇలా మాట్లాడారని ఆయన.. ప్రతిపక్షం లేదు అన్న భావన రాకుండా చేయడానికి.. వైసీపీ పాత్రను కూడా తామే పోషిస్తున్నామని ప్రజలకు సంకేతం ఇవ్వడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు.
ప్రతిపక్షం లేదనే భావన ప్రజలకు రాకుండా..స్వపక్షంలో విపక్షం !
ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే తమకు నలభై శాతం ఓట్లు వచ్చాయని వారంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఏమైనా చేసింది కూడా ఏమీ లేదు. నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శించడం తప్ప.. ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు ఏం చేయాలన్నదానిపై వారికో వ్యూహం ఉన్నట్లుగా కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలకూ హాజరయ్యేందుకు వారు రెడీగా లేరు. ఈ పరిస్థితులతో తామే ప్రతిపక్షంగా ఉంటామని కూటమిలోని పార్టీలు వ్యూహాత్మకంగా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టి ఇప్పటికీ దాడులు చేస్తున్న వారిని కంట్రోల్ చేయకపోవడం సమస్యగా మారింది. కూటమి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ వ్యాఖ్యానించారని అంటున్నారు.
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
పవన్ వ్యూహాన్ని గుర్తించిన వైసీపీ
పవన్ కల్యాణ్ ప్రకటన చేసిన తర్వాత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ గా ఒరియంటేషన్ క్లాసులు అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉండి బహిరంగంగా హోంమంత్రి పనితీరను ప్రశ్నించడం ఏమిటని ఆయన అంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ప్రతిపక్షమని ఆయన భావన. ఇక్కడ వైసీపీకి లాజిక్ అర్థమవడం ద్వారానే ఇలా స్పందించారని భావిస్తున్నారు. ఎందుకంటే బుగ్గన పార్టీ ఓడిపోయినప్పటి నుండి పెద్దగా బయట కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. హఠాత్తుగా ఆయన మాజీ శాసనసభా వ్యవహారాల మంత్రిగా తెరపైకి వచ్చేశారు. పవన్ ను తప్పు పట్టారు.
11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
కూటమి వ్యూహాత్మకంగా వైసీపీని పక్కన పెడుతోందా ?
రాజకీయాలంటేనే వ్యూహాత్మక అడుగులు. ప్రస్తుతం జగన్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీ నేతలు వరుసగా పార్టీ మారిపోయేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడం కష్టంగా మారింది. అందుకే పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చి స్వపక్షంలో విపక్షం మాదిరిగా వ్యవహిస్తున్నారని.. వైసీపీ గురించి ప్రజల్లో ఆలోచన లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఇలా పోలీసులపై సీరియస్ అవడానికి మరో కారణం ఉందని వారు .. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు.. మార్ఫింగ్‌లను అడ్డుకోవడానికి సీరియస్ గా ప్రయత్నించడం లేదని.. ఆ కోణంలోనూ పవన్ సీరియస్ అయ్యారని అంటున్నారు. అదే నిజమైతే.. వైసీపీ క్యాడర్ మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మొత్తంగా పవన్ అనాలోచితంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరని.. రాజకీయంగా ఇబ్బంది అవుతుందని తెలిసినా వ్యాఖ్యలు చేశారంటే ఏదో ఉందని.. వేచి చూడాలని వైసీపీ అనుకుంటోంది.