Kasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam
తెలుగు ప్రజలపై నటి కస్తూరి నోరు పారేసుకున్నారా..ఆమె తెలుగు ప్రజలను అవమానించారా..? ఇప్పుడే సోషల్ మీడియా మొత్తం కస్తూరి మాటల దుమారం నడుస్తోంది. రాజు దగ్గర పనిచేసుకోవటానికి వచ్చిన వాళ్లంటూ ఆమె తెలుగువారిని అవమానించారంటూ పెద్దఎత్తున వివాదం రేగుతోంది. తమిళనాడు బీజేపీ ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో కస్తూరి ఏమన్నారో ఓ సారి వినండి.అయితే తన వ్యాఖ్యలపై రేగిన వివాదం మీద కస్తూరి స్పందించారు. తమిళుల మధ్య చిచ్చుపెట్టి విభజన రాజకీయాలు చేస్తున్న కొందరు డీఎంకే నేతల గురించే ఈ వ్యాఖ్యలు చేశానని కస్తూరి బదులిచ్చారు. తెలుగు వాళ్లకు తనపై ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతను దూరం చేసేలా ఫేక్ న్యూస్ స్ప్రైడ్ చేస్తున్నారని కస్తూరి మండిపడ్డారు. తన మెట్టునిల్లు తెలుగు అని, తన పూర్వీకులు తెలుగువాళ్లే అనే విషయం డీఎంకే నేతలకు తెలియదని అందుకే ఇలా ట్రోల్ చేస్తున్నారన్న కస్తూరి హిందూ వ్యతిరేకులైన వీళ్లంతా సనాతన ధర్మం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడులను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓ కుటుంబాన్ని ఇచ్చిన తెలుగు వాళ్లు ఈ వార్తలను నమ్మొద్దని...హిందూ వ్యతిరేకులైన డీఎంకే చేసే గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దంటూ కస్తూరి రిక్వెస్ట్ చేశారు.