(Source: ECI/ABP News/ABP Majha)
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Ola EV Battery : ఎలక్ట్రిక్ బ్యాటరీ నాణ్యత లేదని, ఛార్జర్ సమస్య పరిష్కారం కావడం లేదని కోర్టును ఆశ్రయించడంతో కస్టమర్ కు రూ.1.73 లక్షలు చెల్లించాలని కోర్టు ఓలా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.
Ola Fined News | హైదరాబాద్: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ విద్యుత్ స్కూటర్ల తయారీలో ఓలా ముందంజలో ఉంది. అయితే కొన్నిచోట్ల ఓలా బ్యాటరీ సమస్యతో వాహనాలు పేలిపోతున్నాయని ఆరోపణలు వచ్చేవి. కొన్ని రోజుల కిందట ఓ కమెడియన్, వర్సెస్ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ వివాదం చెలరేగింది. ఆ సమయంలో ఓలాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాసిరకం బ్యాటరీ అని కొందరు, ఇతర సమస్యలు వచ్చాయని ఓలా సర్వీస్ సెంటర్ల వద్ద వాహనాలు పెద్ద మొత్తంలో ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ఈ క్రమంలో ఓలా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుడికి రూ.1.63లక్షలు జరిమానా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ ను ఆదేశించింది. కస్టమర్ మానసిక క్షోభకు గురయ్యారని, అందుకుగానూ అదనంగా రూ.10 వేలు చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్ కు చెందిన సునీల్ చౌదరి అనే వ్యక్తి ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే ఓలా ఈవీ స్కూటర్లలో కంపెనీ నాసిరకం బ్యాటరీ వాడుతోందని వినియోగదారుల కోర్టును సునీల్ ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయంపై విచారణ జరిపి నోటీసులు ఇచ్చినా ఓలా స్పందించలేదు. దాంతో బాధితుడికి ఏకంగా రూ.1.63లక్షలు జరిమానా చెల్లించాలని ఓలా కంపెనీని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశించింది. ఈ సమయంలో బాధితుడు మానసిక క్షోభకు గురయ్యాడంటూ మరో రూ.10 వేలు సైతం (మొత్తం రూ.1.73 లక్షలు) చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 2023 నుంచి 12 శాతం వడ్డీతో రిఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. చౌదరి ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ.1.63 లక్షలు చెల్లించి 2023 జూన్ లో కొనుకగోలు చేశాడు. రూ.6,299 వారంటీ కూడా తీసుకున్నాడు. బ్యాటరీ సమస్య ఉందని, బ్యాటరీ ఛార్జర్ సరిగ్గా లేదని ఓలాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 10 రోజుల తరువాత ఓలా బ్యాటరీ మార్చినా అది సరిగ్గా పనిచేయడం లేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఓలా స్పందించడం లేదని బాధితుడికి భారీ పరిహారం ఇవ్వాలని ఓలాను ఆదేశించింది.
Also Read: TGSRTC Charges Hike: టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్