అన్వేషించండి

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?

Andhra : విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది.

Is TDP contest the MLC elections of Vizianagaram local bodies :  విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక  నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది.  వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తనపై అనర్హతా వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ కారణంగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు కూడా తక్కువేనని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనందున కొనసాగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. 

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ - బొత్స ఫ్యామిలీ నుంచే వైసీపీ అభ్యర్థి ? 

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు  పదకొండో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది.  28వ తేదీన పోలింగ్ జరుగుతుంది.  విజయనగరం ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో  టీడీపీలో చేరారు. ఆయన చేరలేదు. అయితే టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పిఆయనపై రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేశారు.  గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు    టీడీపీ  బాయ్ కాట్ చేసింది.  దీంతో సహజంగానే వైసీపీకి పార్టీకి మెజార్టీ ఉంది.  విశాఖలో ఉపఎన్నిక జరిగితే  బొత్సకు బాధ్యత ఇచ్చారు. ఆయననే అభ్యర్థిగా ఖరారు చేశారు.  ఇప్పుడు కూడా ఆయన కుటుంబానికే జగన్ టిక్కెట్ ఆఫర్ చేస్తారని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే పెడతారు. బొత్స కుటుంబంలోని అభ్యర్థి అయితేనే బలమైన అభ్యర్థిగా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. 

Also Read: Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - విద్యార్థులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విజయనగరం స్థానిక సంస్థల్లో మొత్తం ఓటర్లు 753 మంది ఉన్నారు. వీరిలో వైసీపీకి 548 మంది, టీడీపీకి 156,  జనసేనకు 13 మంది ఉన్నారు. స్వతంత్రులు 14 మంది ఉండగా ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు 22 మంది ఉన్నారు. ఎలా చూసినా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీలో చేరిపోయారు. బొత్స కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసే అంతా చూసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవిని మళ్లీ విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఆయన ఇంకా ఉపఎన్నికపై దృష్టి పెట్టలేదు. మరో వైపు బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ ఉపఎన్నిక కోసం ఆయన తిరిగి వస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 

నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ పోటీపై రాని స్పష్టత 

వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా అది బొత్స కు టుంబం నుంచే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ వైసీపీ కూడా అభ్యర్థిపై ఎలాంటి కసరత్తులు చేయలేకపోయింది. విజయనగరం జిల్లా కాబట్టి బొత్స మాటే నెగ్గుతుంది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.   విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ఉంది. శాఖ స్థానిక సంస్థల విషయంలో  టీడీపీ నేతలు మెజార్టీ ఓటర్లు ఉన్నారని భరోసా ఇవ్వలేకపోవడంతో బొత్సకు వాకోవర్ లభించింది. విజయనగరం జిల్లా నేతలు ఏం చేస్తారన్నదానిపై చర్చ నడుస్తోంది. ఒక వేళ పోటీ పెట్టాలనుకుంటే అనర్హతా వేటు పడిన ఇందుకూరి రఘురాజుకే టీడీపీ చాన్స ఇవ్వాలన్న సూచనలు  ఉన్నాయి.  గత ఎన్నికల తరవాత వైసీపీ క్యాడర్   టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. రఘురాజు వర్గం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయింది. 

వైసీపీ, టీడీపీ ఇద్దరూ పోటీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ జరుగుతుంది. ఎవరైనా వెనక్కి తగ్గితే మాత్రం.. ఏకగ్రీవం అవుతుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget