అన్వేషించండి

Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?

Thandel Release Date: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజా సినిమా 'తండేల్' విడుదల గురించి నవంబర్ 5న నిర్మాతలు ఓ ప్రకటన చేయనున్నారు. సినిమా వాయిదా వేసిన వాళ్లకు నష్టం లేదని సమాచారం.

'తండేల్' (Thandel) సినిమా బడ్జెట్ ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) మీద అంత బడ్జెట్ పెట్టడం ఏమిటని కొంత మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆఫ్ ద రికార్డ్ ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. రూ . 65 నుంచి 70 కోట్లు ఖర్చు అవుతుందని నిర్మాణంలోకి దిగితే... ఇప్పుడు అది కాస్త రూ. 80 కోట్ల వరకు చేరింది. దానికి తోడు అనుకున్న సమయంలో విడుదల కావడం లేదు. వాయిదా మీద వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే నిర్మాతలకు నష్టం లేదని ఆల్రెడీ వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారని సమాచారం. 

నాన్ థియేట్రికల్ రైట్స్ సేవ్ చేశాయా?
'తండేల్' బడ్జెట్ రూ. 80 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ అంటే భారీ హిట్ అయితే తప్ప థియేటర్ల నుంచి అంత మొత్తం వచ్చే అవకాశం లేదు. నాగ చైతన్య గత సినిమాలు ఏవీ థియేటర్ల నుంచి 80 కోట్ల షేర్ రాబట్టినవి లేవు. మరి ఏ ధైర్యంతో నిర్మాతలు అంత ఖర్చు చేస్తున్నారు? ఏ ధైర్యంతో వాయిదా మీద వాయిదా వేస్తున్నారు? అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ అని చెప్పాలి.

'తండేల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ 40 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... కేవలం సౌత్ లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ మాత్రమే ఇచ్చారని టాక్. అది పక్కన పెడితే 'తండేల్' సాంగ్స్ రైట్స్‌ కోసం ఆదిత్య మ్యూజిక్ 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ రెండింటితో నిర్మాతలకు 50 కోట్లు వచ్చాయి. 

హిందీ ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్మలేదు. దర్శకుడు చందు మొండేటి తీసిన లాస్ట్ సినిమా 'కార్తికేయ 2' నార్త్ ఇండియాలో భారీ విజయం సాధించింది. అందువల్ల, ఈ 'తండేల్' సినిమాకు అక్కడ క్రేజ్ ఉంటుంది. అటు నాగ చైతన్య కూడా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో చిన్న రోల్ చేశారు. ఆయన కూడా అక్కడ ప్రేక్షకులకు పరిచయమే. తెలుగు శాటిలైట్ రైట్స్ మీద కూడా మంచి అమౌంట్ వస్తుంది. ఎలా లేదన్నా థియేట్రికల్ రైట్స్ మీద మరొక 10 నుంచి 15 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. దాంతో నిర్మాతలకు మినిమమ్ లో మినిమం 60 కోట్లు వస్తాయి. థియేటర్స్ నుంచి 20 కోట్ల రూపాయల షేర్ వస్తే చాలు. నిర్మాతలు లాభాల బాటలోకి వస్తారు. 

Also Readరంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!



ఉత్తరాంధ్ర జిల్లాలలోని మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'తండేల్' సినిమాను రూపొండుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల షేర్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎంత భారీ హిట్ అవుతుందనే దాని మీద నిర్మాతలు అల్లు అరవింద్, 'బన్నీ' వాస్ లాభాల షేర్ ఆధారపడి ఉంటుంది. నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Readశ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget