అన్వేషించండి

EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!

Ramadan 2025 Movies: రంజాన్ రావడానికి ఇంకా ఐదు నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఆ సీజన్ మీద కొన్ని సినిమాలు కన్నేశాయి. వచ్చే ఏడాది ఈద్ పండక్కి వచ్చే సినిమాలు ఏవో చూడండి.

ఫెస్టివల్ సీజన్ అంటే మినిమం మూడు సినిమాలు రిలీజ్ కావడం గ్యారెంటీ. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', శివ కార్తికేయన్ 'అమరన్', కిరణ్ అబ్బవరం 'క' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కన్నడ హీరో మురళి నటించిన భగీర వచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. సంక్రాంతికి కూడా మూడు నాలుగు సినిమాలు రావడం గ్యారెంటీ. ఇంకా ఐదు నెలల దూరంలో ఉన్న రంజాన్ పండక్కి కూడా మూడు సినిమాలు రావడం పక్కా. ఆ సినిమాలేవో తెలుసా? 

రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు
రంజాన్... దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్రంగా జరుపుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ పండక్కి ప్రభుత్వం కూడా సెలవులు ఇస్తుంది. ఇతర మతస్థులు కొందరు హలీం తినడానికి అమితమైన ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇండియన్ ఫెస్టివల్ హాలిడేస్ లో రంజాన్ ఓ పెద్ద పండగ అని చెప్పాలి. 

రంజాన్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి హీరోలకు కొందరు ఆసక్తి చూపిస్తారు. ఆ హీరోల లిస్టు తీస్తే బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ పేరు అందరి కంటే ముందు ఉంటుంది. ప్రతి రంజాన్ పండక్కి తన సినిమా విడుదల చేయడం ఆయన ఓ అలవాటుగా పెట్టుకున్నారు. 

వచ్చే ఏడాది (2025)లో రంజాన్ పండక్కి 'సికందర్' సినిమా విడుదల చేయడానికి సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో కండలు వీరుడు కథానాయకుడిగా రూపొందుతున్న 'సికందర్' సినిమాను మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలకు హిట్స్ ఇచ్చారు మురుగదాస్. అయితే కొన్నాళ్ళకు ఆయన సరైన విజయాలు లేక సతమతం అవుతున్నారు. సల్మాన్ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని కసిగా పనిచేస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో 'సికందర్' సినిమాను తెలుగు తమిళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.

Also Read: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!


రంజాన్ బరిలో వస్తున్న మరో సినిమా 'లూసిఫర్ 2'
మోహన్ లాల్ హీరోగా మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'లూసిఫర్'. మలయాళంలో భారీ విజయం సాధించింది ఆ సినిమాను ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది. ఆ సినిమానే 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు చిరంజీవి. 

దర్శకుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ మొదటి సినిమా 'లూసిఫర్'. మంచి కమర్షియల్ సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందుకని 'లూసిఫర్ 2: ఎంపరర్' మీద భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు.

Also Readలక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్


పవన్ కళ్యాణ్ వస్తారా? విజయ్ దేవరకొండ వస్తారా?
రంజాన్ పండక్కి విడుదల చేయడానికి మన తెలుగు ఇండస్ట్రీలో రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ (VD 12 Movie)ను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే... అదే తేదీకి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' కూడా రానున్నట్లు ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ సినిమాతో విజయ్ దేవరకొండ సినిమా పోటీ పడుతుందా? అనే సందేహాలకు ఆ మధ్య నిర్మాత నాగ వంశీ సమాధానం ఇచ్చారు. కళ్యాణ్ గారి సినిమా వచ్చేటట్లు అయితే తమ సినిమా రాదని చెప్పారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీ బజీగా ఉన్నారు. ఆయన సినిమా షూటింగులు సజావుగా ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. అందువల్ల 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ గనక ఆలస్యమై వాయిదా పడితే విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది. లేదంటే‌ విజయ్ దేవరకొండ సినిమా వెనక్కి వెళ్లి 'హరిహర వీరమల్లు' అదే తేదీకి వస్తుంది.

Also Readడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్స్ ఫ్రీగా చూడొచ్చు - ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget