Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్
2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రతి ఏడాది తన ప్రభావాన్ని చాటుకుంటోంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Year Ender 2024: ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం ప్రపంచవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. నవంబర్ 24, 25 తేదీల్లో జరిగిన ఈ వేలంలో 577 మంది ప్లేయర్లు తమ లక్కును పరీక్షించుకున్నారు. అందులో 182 మంది ప్లేయర్లను వివిధ జట్లు కొనుగోలు చేశాయి. వివిధ దేశాలకు చెందిన 62 మంది అమ్ముడుపోగా, మరికొంతమంది ప్లేయర్లు అన్ సోల్డ్ గా మిగిలి షాకిచ్చారు. మొత్తానికి ఈ టోర్నీ కోసం రూ.639.15 కోట్ల మొత్తాన్ని టోర్నీలోని పది జట్లు ఖర్చు చేయనున్నాయి. అయితే ఈ వేలంలోని ముఖ్యాంశాలు మరోసారి.
అత్యంత ఖరీదైన ప్లేయర్ గా రిషభ్ పంత్..
2008లో టోర్నీ మొదలైన ఇన్నేళ్లలో రిషభ్ పంత్ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. వేలం మొదలైన రోజునే రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ తనను సొంతం చేసుకుంది. వేలంతో తొలుత ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ లతో పోటీపడినా లక్నో.. చివరికి 20.75 కోట్ల వద్ద పైచేయి సాధించిది. ఈ దశలో రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా ఢిల్లీ రంగంలోకి దిగగా, రూ.27 కోట్ల కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసి లక్నో పంత్ ను కైవసం చేసుకుంది.
శ్రేయస్ అయ్యర్ ఫ్రాంచైజీ మార్పు..
గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనూహ్యంగా వేలంలోకి వచ్చి, భారీ ధరను దక్కించుకున్నాడు. తన వ్యాల్యూ ఏంటో తెలుసుకోవడం కోసం శ్రేయస్ అయ్యర్ వేలంలోకి వెళ్లాడని కేకేఆర్ వర్గాలు తెలిపాయి. అయితే అయ్యర్ నిర్ణయం అతడి పంట పండించింది. రూ.26.75 కోట్లతో తనను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా, టోర్నీలోనే రెండో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. ఇక హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తో కలిసి కప్పు కొరతను పంజాబ్ కు తీర్చాలని భావిస్తున్నాడు.
విల్ జాక్స్ కొనుగోలులో వివాదం..
ఇక ఆర్సీబీ ప్లేయర్ విల్ జాక్స్ వేలంలోకి రాగా కాస్త వివాదస్పద పద్ధతిలో అతడిని ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. వేలంలో రూ.5.25 కోట్లకు ముంబై జాక్స్ ను దక్కించుకోగా, తన రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ను ఆర్సీబీ వినియోగించుకోలేదు. దీంతో వేలం అనంరరం ముంబై యాజమాని ఆకాశ్ అంబానీ.. ఆర్సీబీ యాజమాన్యం దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం వివదాస్పదమైంది. ముందే సంప్రదింపులు చేసుకుని జాక్స్ ను ముంబై దక్కించుకుందని ఆరోపణలు రాగా, కేవలం ఆర్సీబీకి థాంక్స్ చెప్పడం కోసమే అనంత్ అక్కడికి వెళ్లాడనే సమర్థింపులు కూడా వచ్చాయి. మొత్తానికి ఇదో టాక్ ఆఫ్ ది టౌన్ లాగా మారింది.
అతి పిన్న వయస్కుడైన ఐపీఎల్ ప్లేయర్ గా సూర్యవంశీ..
ఇక బిహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో ఆడబోతున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. రూ.1.10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. దీంతో టీనేజీలోనే కోటీశ్వరుడిగా సూర్యవంశీ నిలిచాడు.
బిగ్ ప్లేయర్లకు షాక్..
ఈ ఏడాది ఐపీఎల్ మెగావేలం కొంతమందికి చేదు అనుభవం మిగిల్చింది. హుషారుగా తమ పేరును వేలంలో నమోదు చేసుకున్న వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు అన్ సోల్డ్ గా మిగిలి షాకిచ్చారు. ముఖ్యంగా పీయూష్ చావ్లా, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్ తదితరులు అమ్ముడు పోలేదు. అలాగే ఫేమస్ క్రికెటర్లయిన ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ లాంటి వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ టీమ్ ఉత్సాహం చూపించలేదు. మొత్తానికి ఎన్నో ఆశలు రేపిన వేలం ముగిసింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకుని జట్టును ఫుల్ స్ట్రెంగ్త్ చేసుకుని వచ్చే ఏడాది కప్పు కొట్టాలని సన్నాహకాలు చేసుకున్నాయి.
Also Read: World Test Championship Table Update: ప్రొటీస్‌కు ఫైనల్ బెర్త్ ఖరారు - పాక్‌పై స్టన్నింగ్ విక్టరీ, సెకండ్ ప్లేస్ కోసం భారత్, ఆసీస్ ఫైటింగ్