Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Best Gaming Smartphones in India: మనదేశంలో రూ.20 వేలలోపు ధరలో బెస్ట్ గేమింగ్ ఫోన్లు చాలా ఉన్నాయి. వీటిలో పోకో ఎక్స్5 ప్రో, రియల్‌మీ నార్జో 60 5జీ, రెడ్‌మీ నోట్ 13ప్రో ఫోన్లు ఉన్నాయి.
Best Gaming Smartphones: నేటి కాలంలో గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్‌షిన్ ఇంపాక్ట్ వంటి హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడేందుకు శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ అవసరం. మీ బడ్జెట్ రూ.20 వేల వరకు ఉంటే మార్కెట్లో చాలా గొప్ప గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్‌లో ఉత్తమ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.
పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro)
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పవర్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది గేమ్ టర్బో మోడ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. దాని పెద్ద అమోఎల్ఈడీ డిస్‌ప్లే గేమ్స్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. మీరు దీన్ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఈ ఫోన్ ధర రూ.17,999గా ఉంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
రియల్‌మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G)
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే అందించారు. పవర్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఏఐ ఆధారిత పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌ను కలిగి ఉంది. బ్యాలెన్స్‌డ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్. మీరు దీన్ని ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఈ ఫోన్ ధర రూ.17,988గా ఉంది.
రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)
ఈ గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్ 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది 5100 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కూలింగ్ టెక్నాలజీ, సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ హై గ్రాఫిక్స్ గేమ్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఈ ఫోన్ ధర రూ.17,898గా ఉంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
Unlock the power of the #RedmiNote13Pro with a 200MP OIS camera, 120Hz AMOLED display, ultra-thin bezels, 67W turbocharging, MediaTek Helio G99-Ultra, and secure in-screen fingerprint sensor.
— Xiaomi Kenya (@Xiaomi_Kenya) August 13, 2024
Make a smart choice today SAVE KES 3500/- on #OffersFestival campaign… pic.twitter.com/3hk3ISPvmf