Lucky Bhaskar OTT Release Date: లక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
Lucky Bhaskar OTT Platform: దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' సినిమాకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. మరి, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
Lucky Bhaskar digital streaming date locked: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లలో వసూళ్ల దుమ్ము దులుపుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?
నాలుగు వారాల్లో ఓటీటీలోకి 'లక్కీ భాస్కర్'!?
అక్టోబర్ 31... థియేటర్లలో 'లక్కీ భాస్కర్' విడుదలైన తేదీ! దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, అన్ని భాషల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. కానీ, ఓటీటీలోకి త్వరగా వచ్చే సూచనలు కనబడుతున్నాయి.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది. ఇంటర్నేషనల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరున... అంటే నవంబర్ 31న 'లక్కీ భాస్కర్' డిజిటల్ ప్రీమియర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుందని తెలిసింది. మలేషియా వీక్షకులకు విడుదల చేసిన రిలీజ్ డేట్ చార్టులో ఈ సినిమా విడుదల తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. దాంతో విషయం బయటకు వచ్చింది.
The 𝑩𝑰𝑮𝑮𝑬𝑺𝑻 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 #LuckyBaskhar had Strong DAY 2 Strengthened by FAMILY AUDIENCE all over! 🤩🫶
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2024
Witness Baskhar's Adventurous Journey to the TOP on big screens near you now! 💰🏦
In Cinemas Now - Book your tickets 🎟 ~… pic.twitter.com/zdQX0WhT6S
స్టాక్ మార్కెట్ మోసాలను ఆధారంగా చేసుకుని 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా... ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల అని పని తీరు సైతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా నాలుగు వారాలకు ఓటీటీలోకి రావడం అంటే థియేటర్ల నుంచి వచ్చే రెవిన్యూను నిర్మాత కోల్పోవాల్సి ఉంటుంది.
Also Read: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఈ బ్లాక్ బస్టర్స్ ఫ్రీగా చూడొచ్చు - ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసా?
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సినిమా రూపొందింది. గతంలో విశ్వక్ సేన్ హీరోగా ఈ సంస్థలు నిర్మించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు నెలకు 'లక్కీ భాస్కర్' ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
Also Read: ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఇమాన్వి అక్టోబర్ ఫోటో డంప్