అన్వేషించండి
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Tata Punch EV: టాటా తన కొత్త పంచ్ ఈవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.

టాటా పంచ్ ఈవీ
1/6

టాటా పంచ్ ఈవీ భారతదేశ మార్కెట్లో ఈరోజు లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. దాని టాప్ ఎండ్ వేరియంట్ ధరను రూ. 14.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు.
2/6

ఈ కారు డెలివరీని కంపెనీ జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభించనుంది. కస్టమర్లు స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్‌లలో టాటా పంచ్ ఈవీని కొనుగోలు చేయవచ్చు. రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి టాటా పంచ్ ఈవీని బుక్ చేయవచ్చు.
3/6

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కొత్త లుక్ గురించి చెప్పాలంటే అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫేషియా ఆకర్షణకు పెద్ద కారణం. ఇది కాకుండా నెక్సాన్ ఆధారంగా రూపొందించిన బోనెట్ వెడల్పుతో పాటు రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో రిఫ్రెష్ చేసిన బంపర్, గ్రిల్ డిజైన్ కూడా ఉంది.
4/6

టాటా పంచ్ ఈవీ ప్రత్యేక ఫీచర్ల గురించి చెప్పాలంటే స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఛార్జర్‌ను బ్రాండ్ లోగో కింద అందించిన మొదటి టాటా ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీనే.
5/6

ఈ కారు వెనుక వైపు గురించి చెప్పాలంటే ఇది వై ఆకారంలో బ్రేక్ లైట్లను కలిగి ఉన్న ఐసీఈ వేరియంట్ వంటి టెయిల్ లైట్లను కలిగి ఉంది. టాటా పంచ్ ఈవీ పైకప్పు మీద స్పాయిలర్ ఉంది. ఇందులో రీడిజైన్ చేసిన బంపర్ కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఇది కొత్త 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.
6/6

టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో లాంచ్ అయింది. ఇందులో మొదటిది 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. రెండోది 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఏకంగా 421 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది.
Published at : 17 Jan 2024 11:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion