జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఇదివరకే అనంతపురం జిల్లా నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు జనసేన అధ్యక్షుడు వెళ్తున్నారు.
రెండో విడత జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు మీదుగా పెదవేగి, లింగపాలెం మండల నుంచి చింతలపూడికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
చింతలపూడిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చెక్ అందజేయనున్నారని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు
రెండో విడత "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర"లో నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 40 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఆ రైతుల కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందచేస్తారు.
పవన్ కళ్యాణ్ రైతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్‌కు వెరైటీ స్వాగతం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత 26 జిల్లాలు చూశారా?
In Pics: గళమెత్తిన ఉపాధ్యాయులు... కదంతొక్కి కలెక్టరేట్ల ముట్టడి
Amalapuram: అమలాపురంలో జనసేన పీఏసీ ఛైర్మన్ మనోహర్ టూర్.. దెబ్బతిన్న పంటలు పరిశీలన
Chandrababu Crying: మరీ ఇంత అవమానమా... కన్నీళ్లు ఆపుకోలేకపోయిన చంద్రబాబు
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ