UK political crisis: యూకేలో మహారాష్ట్ర పాలిటిక్స్ రిపీట్- కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే?
UK political crisis: బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది.
UK political crisis: బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్ర రూపం దాల్చింది. భారత సంతతికి చెందిన రిషి సునక్, పాక్ మూలాలున్న సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం పీక్ స్టేజ్‌కు చేరింది. బోరిస్ జాన్సన్ నాయకత్వంపై నమ్మకంపై పోయిందంటూ బుధవారం ఏకంగా 15 మంది మంత్రులు రాజీనామా చేశారు.
FIVE ministers resign in one fell swoop: Kemi Badenoch, Neil O'Brien, Alex Burghart, Lee Rowley and Julia Lopez pic.twitter.com/WAYannhrvR
— Dominic Penna (@DominicPenna) July 6, 2022
ముందుగా జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్, జో చర్చిల్, స్టూవర్ట్ ఆండ్రూ, విల్ క్విన్స్, రాబిన్ వాకర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో ఐదుగురు మంత్రులు కేమీ బదెనోచ్ జూలియా లొపెజ్, లీ రౌలీ, నీల్ ఓబ్రియాన్, అలెక్స్ బర్హార్ట్ సంయుక్తంగా రాజీనామా లేఖ సమర్పించారు. వెనువెంటనే ఉపాధి కల్పన మంత్రి మిమ్స్ డేవిస్ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
37 మంది
మంత్రులతో పాటు దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 37కి చేరింది.
రాజీనామాకు డిమాండ్
వరుస రాజీనామాలతో జాన్సన్ మెడపై రాజీనామా కత్తి వేలాడింది. ఆయన రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరుగుతోంది. జాన్సన్ తక్షణం తప్పుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. మరోవైపు జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదే కారణమా?
Also Read: Smriti Irani Jyotiraditya scindia: కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, సింధియాకు అదనపు బాధ్యతలు
Also Read: Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా