By: ABP Desam | Updated at : 07 Jul 2022 11:51 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Smriti Irani Jyotiraditya scindia: మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి అదనంగా మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
President of India, as advised by PM, accepts the resignations of Mukhtar Abbas Naqvi and Ram Chandra Prasad Singh from Union Council of Ministers, with immediate effect. Smriti Irani to be assigned Ministry of Minority Affairs charge, in addition to her existing portfolio. (1/2)
— ANI (@ANI) July 6, 2022
వారి రాజీనామా
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నఖ‍్వీతో పాటుగా రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు.. కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అందుకేనా
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగిన నఖ్వీ.. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారంతో ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా ముగియనుంది. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. అటల్ బిహారీ వాజ్‌పేయీ గవర్నమెంట్‌లో కూడా కేబినెట్ మంత్రులుగా పని చేశారు.
ఉపరాష్ట్రపతిగా
మరోవైపు నఖ్వీకి రాజ్యసభ కోసం మరో ఛాన్స్ ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
Also Read: Corona Cases: దేశంలో కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్- తాజాగా 18,930 మందికి కరోనా
Also Read: Edible Oil Price Today: లీటర్ నూనెపై రూ.10 తగ్గించండి, కంపెనీలకు సూచించిన కేంద్రం
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Chhattisgarh Election Result 2023: ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీదే అధికారం, కాంగ్రెస్ ఆశలన్నీ అడియాసలే
Rajasthan Election Results 2023: కాంగ్రెస్ చేజారిన రాజస్థాన్, ఇక్కడా బీజేపీదే ఘన విజయం
Madhya Pradesh Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం, భారీ మెజార్టీ సాధించిన కమల దళం
Election Results 2023: కాంగ్రెస్ ఓటమి I.N.D.I.A కూటమిపై ప్రభావం చూపుతుందా? వ్యూహాలు మారతాయా?
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>