QWERTY Keyboard : కీబోర్డ్ అక్షరాల మిస్టరీ ఏంటీ? 'ABC' క్రమంలో ఎందుకు ఉండవు?
QWERTY Keyboard : రోజూ మీరు టైప్ చేసే కీబోర్డులో అక్షరాలు చాలా గజిబిజిగా ఉంటాయి. దీన్ని క్వర్టీ మోడల్ అంటారు. క్రమంలో ఎందుకు లేవని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణం ఇక్కడ చూద్దాం.

QWERTY Keyboard : డిజిటల్ ప్రపంచంలో మనం ప్రతిరోజూ ఉపయోగించే కీబోర్డ్ లేఅవుట్ ఒక పెద్ద రహస్యాన్ని దాచి ఉంచింది. మీ కీబోర్డ్ అక్షరాలు 'ఏ, బి, సి, డి'లాగా అక్షర క్రమంలో కాకుండా, ఎగుడుదిగుడుగా, తారుమారుగా ఎందుకు పెట్టారు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ విచిత్రమైన అమరిక వెనుక ఒక చారిత్రక కారణం, 150 సంవత్సరాల క్రితం టైపింగ్‌లో ఎదురైన సాంకేతిక సమస్య ఉంది.
ఆల్ఫాబెట్ ఆర్డర్ నుంచి 'క్వర్టీ'వరకు మనం ప్రస్తుతం వాడుతున్న ఈ కీబోర్డ్‌ను మొదట ఇష్టపోర్ అనే వ్యక్తి కనిపెట్టారు. ప్రారంభంలో ఈ కీబోర్డులలో అక్షరాలన్నీ సాధారణంగా ఆల్ఫాబెట్స్ ఆర్డర్ వైజ్ ఉండేవి, అంటే A, B, C, D క్రమంలోనే అమర్చి ఉండేవి. కీబోర్డ్ మొదటి రూపంలో అక్షరాలు వరుసగా ఉండడం వల్లనే సమస్య మొదలైంది. ఎందుకంటే, జనాలు ఆ కీస్‌ను చాలా ఫాస్ట్ ఫాస్ట్‌గా టైప్ చేసేవారు. ఆ సమయంలో ఉపయోగించిన టైప్‌రైటర్స్ ఈ వేగాన్ని తట్టుకోలేకపోయేవి.
1873లో పరిష్కారం: కీస్ తారుమారు
కీబోర్డులు ఆర్డర్ వైస్ ఉండటం. జనాలు వేగంగా టైప్ చేయడం వల్ల, టైప్‌రైటర్లలోని కీస్ ఒకదానికొకటి తగిలి,జామ్ అయిపోయేవి. ఇది టైపింగ్ ప్రక్రియను పూర్తిగా అడ్డుకునేది. సమయాన్ని వృథా చేసేది.
దీంతో ఈ సాంకేతిక సమస్యకు పరిష్కారం కనుగొనడం అత్యవసరం అయ్యింది. దీనికి సొల్యూషన్‌గా ఏం చేశారంటే, 1873లో ఈ కీబోర్డ్ లోని అక్షరాలన్నిటినీ తారుమారు చేసి కొత్తగా అమర్చారు. అప్పుడే ఈ కీబోర్డ్ క్వర్టీ (QWERTY) కీబోర్డ్ గా రూపాంతరం చెందింది.
క్వర్టీ అమరిక వ్యూహం
కీబోర్డును 'క్వర్టీ'గా మార్చడంలో ముఖ్య ఉద్దేశం, తరుచుగా ఉపయోగించే అక్షరాల కలయికలను వేరు చేయడం. ఈ అమరిక వల్ల టైప్ చేసేటప్పుడు వేలు ఒకదాని తరువాత మరొకటి పక్కపక్కనే ఉండే అక్షరాలను వేగంగా కొట్టకుండా, కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
టైపింగ్ వేగం కృత్రిమంగా మందగించడం వల్ల, మెకానికల్ టైప్‌రైటర్‌లోని కీలు జామ్ అవ్వకుండా నివారించగలిగారు. ఈ విధంగా, క్వర్టీ లేఅవుట్ వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది. ఇది వేగాన్ని పెంచడానికి కాదని అర్థమవుతుంది.
ఆధునిక యుగంలో క్వర్టీ
నేటి ఆధునిక కంప్యూటర్ కీబోర్డులు, డిజిటల్ స్క్రీన్ కీబోర్డులు మెకానికల్‌గా జామ్ అవ్వవు. అయినప్పటికీ, టైప్‌రైటర్ల నుంచి వచ్చిన ఈ చారిత్రక క్వర్టీ లేఅవుట్ నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం, దశాబ్దాలుగా టైపింగ్ నేర్చుకున్న కోట్లాది మంది ప్రజలు ఈ లేఅవుట్‌కు అలవాటు పడడమే. మార్పుకు అలవాటు పడటం కష్టం కాబట్టి, ఆ పాత పరిష్కారాన్నే సాంకేతికత ముందుకు తీసుకువెళ్తోంది.
మీరు మీ కంప్యూటర్‌లో లేదా మొబైల్‌లో QWERTY కీబోర్డ్‌ను చూసినప్పుడల్లా, ఇది కేవలం యాదృచ్ఛిక అమరిక కాదని గుర్తుంచుకోండి. ఇది 150 సంవత్సరాల క్రితం టైప్‌రైటర్ మెకానిజమ్‌ను కాపాడటానికి, ఫాస్ట్ టైపర్‌లను నెమ్మదింపజేయడానికి ఉద్దేశించిన ఒక తెలివైన చారిత్రక పరిష్కారం. ఈ చిన్నపాటి కీబోర్డ్ వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉంది.





















