Twitter killer : జపాన్‌లో ట్విట్టర్ కిల్లర్‌కు ఉరి శిక్ష - ఏం చేసేవాడో తెలిస్తే భయంతో వణికిపోవాల్సిందే !
Japan : జపాన్‌లో "ట్విట్టర్ కిల్లర్"గా పిలిచే తకాహిరో షిరాయిషిని ఉరి తీశారు. జపాన్‌లో 2022 తర్వాత మొదటి ఉరిశిక్ష అమలు జరిగింది.

Japan hangs Twitter killer: తకాహిరో షిరాయిషి అనే 34 ఏళ్ల వ్యక్తిని జపాన్‌లోఉరి తీశారు. జపాన్‌లో 2022 తర్వాత మొదటి ఉరిశిక్ష ఇదే. తకాహిరోని జపాన్ లో అంతా "ట్విట్టర్ కిల్లర్"గా పిలుస్తారు.
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవాళ్లను పిలిచి హ త్య చేసే తకాహిరో
ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వారిని ఓ వ్యక్తి చంపేస్తూ ఉంటాడు. వారు భయంతో ఆత్మహత్య చేసుకోలేకపోతే ఆ వ్యక్తి చంపేస్తాడు. ఆ వ్యక్తి చచ్చిపోయాడని ఎవరికీ తెలియకుండా చేస్తాడు. సినిమాల్లోనే ఇలాంటి క్యారెక్టర్లు కనిపిస్తాయని అనుకుంటారు. కానీ నిజంగానే ఉన్నాయి. అలాంటి వ్యక్తే జపాన్‌లోని తకాహిరో షిరాయిషి.
A Japanese man known as the "Twitter killer", (@/hangingpro) was sentenced to death for murdering 8 women, 1 man.
— Anonymous (@YourAnonCentral) December 15, 2020
He used Twitter to lure suicidal people to his home, promising to help them die.. he robbed, sexually assaulted, and murdered them. #Femicide https://t.co/6gnftSd7Ly pic.twitter.com/K3WbNT5DMx
ట్విట్టర్ ద్వారా వల
షిరాయిషి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (గతంలో ట్విట్టర్) ద్వారా ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తం చేసిన బాధితులను సంప్రదిస్తాడు. అతను వారికి తమ ఆత్మహత్య ప్రణాళికలలో సహాయం చేస్తానని లేదా వారితో పాటు తాను కూడా చనిపోతానని చెప్పి వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పిస్తాడు. అపార్టుమెంట్‌కు పిలిచిన తర్వాత వారిని చంపేస్తాడు. షిరాయిషి బాధితుల శరీరాలను ముక్కలు చేసి శవ భాగాలను కూలర్లు మరియు టూల్‌బాక్స్‌లలో దాచాడు, కొన్ని భాగాలను డంపింగ్ గ్రౌండ్‌లో పడేసేవాడు. ఈ నేరాలు 2017 అక్టోబర్‌లో ఒక మిస్సింగ్ కేసులో పోలీస్ పరిశోధన సమయంలో షిరాయిషీ ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు 15 నుండి 26 సంవత్సరాల వయస్సు గలవారు, వీరిలో ఎక్కువ మంది యువతులు. షిరాయిషి మహిళా బాధితులపై లైంగిక దాడులు కూడా చేసినట్లు నిర్ధారణ అయింది.
🧵 The Chilling Story of Japan’s “Twitter Killer”
— Undiscovered History (@HistoryUnd) May 5, 2025
1/ Between August and October 2017, Takahiro Shiraishi, dubbed the "Twitter Killer," murdered nine individuals in Zama, Japan. He used Twitter to lure vulnerable people struggling with suicidal thoughts to his apartment. pic.twitter.com/v83Zy86sfQ
షిరాయిషీకి 2020లో మరణ శిక్ష
2020లో షిరాయిషికి టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. అతని నేరాలను "క్రూరమైనవి , హీనమైనవి"గా వర్ణించింది. బాధితులు ఆత్మహత్యకు సమ్మతించారని, అందువల్ల మరణశిక్షకు బదులు జైలు శిక్ష విధించాలని షిరాయిషి లాయర్లు వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది, బాధితుల సమ్మతి లేదని, షిరాయిషి ఉద్దేశం "అత్యంత స్వార్థపరమైనది" అని తీర్పు ఇచ్చింది. జపాన్‌లో ఉరిశిక్ష రహస్యంగా అమలు చేస్తారు. ఖైదీలకు ఉరిశిక్ష రోజు ఉదయం వరకు సమాచారం ఇవ్వరు. షిరాయిషీని శుక్రవారం ఉదయమే ఉరి తీశారు.





















