Funeral home Crime: ఆ ఇంట్లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు - హత్యలు చేయలేదు కానీ ఇద్దరికి జైలుశిక్ష - ఈ కేసు చాలా వెరైటీ !
Funeral Crime:అంత్యక్రియలు నిర్వహిస్తామని మృతదేహంతో పాటు డబ్బులు తీసుకుంటారు కానీ ..అంత్యక్రియలు చేయరు. తమ ఇంట్లో ఓ గదిలో పడేస్తారు.

Funeral home owner who stashed nearly 200 decaying bodies: విదేశాల్లో చిత్ర విచిత్రమైన నేరాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. ఓ ఇంట్లో రెండు వందల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. అవి ఎక్కడినో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. హత్యలు చేసినవి కావు.కానీ ఆ ఇంటి ఓనర్ ను అరెస్టు చేశారు.
అమెరికాలోని కొలరాడోలోని పెన్‌రోస్ అనే చిన్న పట్టణంలో ఊరికి కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు ఉంది. ఫిర్యాదులు రావడంతో అక్కడ పరిశోధించిన పోలీసులు దాదాపు 200 కుళ్ళిపోతున్న శవాలను కనిపెట్టారు. పూర్తిగా ఆరా తీస్తే ఆ ఇంటి ఓనర్ల గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదు.. ఫ్యూనరల్ హోమ్. ఆ ఫ్యూనరల్ హోమ్ యజమానులు హాల్‌ఫోర్డ్ , అతని భార్య క్యారీ హాల్‌ఫోర్డ్, దాదాపు నాలుగు సంవత్సరాల పాటు దహనం చేస్తున్నామని చెప్పి చనిపోయిన వారి ఇళ్ల నుంచి శవాలను తీసుకు వస్తున్నారు. కానీ దహనం చేయకుండా.. గదిలో పడేస్తున్నారు. వారికి దహనం చేశామని చెప్పి.. బూడిద అని చెప్పి డ్రై కాంక్రీట్‌ను అందించేవారు. దాంతో వారు దండిగా డబ్బులు ఇచ్చేవారు.
హాల్‌ఫోర్డ్ దంపతులు కుటుంబాల నుండి డబ్బు సేకరించడమే కాకుండా, COVID-19 సహాయంగా ఫెడరల్ ప్రభుత్వం నుండి దాదాపు 900,000 డాలర్లను వసూలు చేశారు. ఈ డబ్బుతో వారు టిఫనీ & కో వంటి లగ్జరీ దుకాణాల నుండి వస్తువులు, $120,000 విలువైన GMC యూకాన్ , ఇన్ఫినిటీ వాహనాలు, లేజర్ బాడీ స్కల్ప్టింగ్, క్రిప్టోకరెన్సీని కొనుగోలుచేశారు.
హాల్‌ఫోర్డ్ దంపతులు 2017లో ఫ్యూనరల్ హోమ్ లైసెన్స్ పొందారు. 2019 నుండి శవాలు నిల్వ చేయడం ప్రారంభించారు 2023లో ఒక దుర్వాసన కారణంగా పోలీసులు ఈ భవనాన్ని తనిఖీ చేయడంతో విషయం బయట పడింది.
It's been two years since nearly 200 decaying bodies were discovered throughout a fetid, room temperature building in rural Colorado.
— ABC News (@ABC) August 22, 2025
Today, the man responsible, a funeral home owner, is set to be sentenced in state court for 191 counts of corpse abuse. https://t.co/PUVKiDMLSZ
అసలు డబ్బులు తీసుకున్నప్పుడు శవాలను దహనం చేయకుండా ఎందుకు దాచుకున్నారో.. అలా కుళ్లిపోతుంటే..అలా ఎందుకు చూస్తూ ఉండిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ శవాల కుటుంబసభ్యులు.. కఠిన శిక్షలు వేయాలని పోరాడారు. దాంతో ఆ దంపతులకు నలభై ఏళ్ల పాటు జైలు శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేరం బయటపడటంతో కొలరాడో ఫ్యూనరల్ హోమ్స్ అన్నింటినీ పోలీసులు తనిఖీలు చేశారు.





















