Trump : ట్రంప్ మరో పుతిన్ - పనామా, కెనడాల్ని ఆక్రమించేస్తారా ?
Donald Trump: వైట్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందే ట్రంప్ వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. పనామా,కెనడాకు యూఎస్ జెండా పెట్టేస్తున్నారు. కలిపేసుకుంటామంటున్నారు.
Trump behavior controversial : కెనడా అమెరికాలో 51వ దేశం అంటూ ట్రంప్ మ్యాపులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. దీనికి కెనడా ప్రధాని ట్రెడావుకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక్క కెనడాలో ఇష్యూలోనే కాదు. పనామా విషయంలోనూ ట్రంప్ ది అదే వైఖరి. పనామాను సు స్వాధీనం చేసుకుంటామని ఆయన అంటున్నారు.
కెనడాను రోజూ టీజ్ చేస్తున్న ట్రంప్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని అన్నారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. ట్రంప్ కెనడా గురించి వ్యాఖ్యలు చేయడం ఇలా తొలిసారి గతంలోనూ వ్యాఖ్యానించారు. కెనడా అమెరికాలోకి చేరాక రెండు రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్. ఒక ముక్కకు ట్రూడో గవర్నర్‌గా ఉండటం ఇంకా బెటర్. రెండు రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్‌గా, మరోటి కన్జర్వేటివ్ స్టేట్‌గా ఉంటే బాగుంటుందని జోస్యం చెబుతున్నారు. ట్రంప్ తీరుతో ట్రూడోకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
పనామా విషయంలోనూ అంతే
పనామాను స్వాధీనం చేసుకుంటామని ఆయన ఇటీవల ప్రకటించారు. ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే.. పనామా కాల్వను మాకు తిరిగి ఇచ్చేయాలి. ఈమేరకు అధికారులకు సూచించండి అని ట్రంప్ పోస్టు చేశారు. పనామా కెనాల్‌ను ఆక్రమిస్తామంటూ హెచ్చరించడంతో పనామా దేశాధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటామని ఆయన తేల్చిచెప్పారు. కీలకమైన పనామా కాల్వలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందని స్పష్టం చేశారు. పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకెళ్లే కంటైనర్ షిప్‌లు అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలూ ఉంటాయి. వీటికి ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని ట్రంప్ కాలువను స్వాధీనం చేస్కుంటానని అంటున్నారు.
వైట్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అద్యక్షుడు అంటే ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది. శత్రు దేశాల సంగతేమోకానీ మిత్రదేశాలకు పరోక్ష వార్నింగిలిస్తున్నారు ట్రంప్. ఆయన ఉద్దేశం అది కాదు కానీ అలాంటి మాటలు ఓ అధ్యక్షుడు మాట్లడటాన్ని ఎవరూ ఊహించలేరు. తాజాగా పొరుగునే ఉన్న పనామా, డెన్మార్క్ లకు హెచ్చరికలు జారీ చేశారు. పనామా కాల్వలో ప్రయాణిస్తున్న పడవలు..వాటికి విధిస్తున్న పన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని తగ్గించాలని లేకపోతే స్వాధీనం చేసుకుంటామన్నారు.ఈ మాటలు ఎక్కడికి దారితీస్తాయోనని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.