అన్వేషించండి

Viral News : పని చేయకపోతే కాదు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారట - ప్రశాంతంగా బతకనీయరా?

chaina: ప్రపంచం మారిపోతోంది పెళ్లి చేసుకోకపోయినా ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ప్రశాంతంగా ఉండనిచ్చేందుకు సిద్ధంగా లేరు.

No marriage  no job: ఉద్యోగమే ఓ పెద్ద సవాల్. దానికి తోడు మళ్లీ సంసార జీవితం . ఈ రెండు బాధ్యతల్ని మోయలేక మగవాడు కిందా మీదా పడుతున్నాడు. అందుకే చాలా మంది ఇప్పుడు నో మ్యారేజ్ అంటున్నారు. చైనాలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకోవడం.. పిల్లల్ని కనడం.. వాళ్లను పెంచడం.. వాళ్లు పిల్లల్ని కనడం.. ఇదేనా జీవితం అనుకుంటున్నారు . ఇంత రొటీన్ లైఫ్ అవసరం లేదని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారు. దీంతో చైనా జనాబా వేగంగా పడిపోతోంది. పుట్టే వాళ్ల కన్నా చనిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. యువత తగ్గిపోతున్నారు. దీంతో అక్కడి చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకోండి.. పిల్లల్ని కనండి అని బతిమాలుతోంది. పిల్లల్ని కంటే ఖర్చులు కూడా భరిస్తామంటోంది. కానీ యువత మాత్రం మీకో దండం అంటున్నారు. 

దీంతో చైనా ప్రభుత్వం రూటు మార్చింది..  కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ముదురు బెండకాయలు.. పెళ్లి ఆలోచన లేకుండా సరదాగా ఉద్యోగం చేసుకుంటున్న వారికి అర్జెంట్ గా పెళ్లి చేయాలని ఆదేశించింది. లేకపోతే ఉద్యోగాల నుంచి తీసేయాలని సూచించింది.  చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం చెప్పడం.. చేయకపోవడం అనేది ఉండదు. అందుకే ముందుగా ఘంటియాన్ కెమికల్స్ అనే కంపెనీ తమ హెచ్ ఆర్ పాలసీలో మార్పులు చేసింది. తమ కంపెనీలో పని చేస్తున్న వారికి కొంత సమయం ఇస్తున్నామని పెళ్లి చేసుకోని వారు.. విడాకులు తీసుకున్న వారు కూడా ఆ గడువులోపు పెళ్లి చేసుకోవాలని ఆదేశించింది. లేకపోతే ఉద్యోగం గురించి మర్చిపోవాలని సూచించింది. 

పెళ్లి చేసుకోవడమే కాదు.. పిల్లల్ని కనాలని దేశ జనాభా సంక్షోభాన్ని అధిగమించాలని ఆ కంపెనీ చెబుతోంది. అయితే చాలా మంది ఉద్యోగం అయినా సరే మానేస్తాం కానీ పెళ్లి మాత్రం చేసుకునేది లేదని స్పష్టం చేశారు. ఒకరో ఇద్దరో ఇలా అంటే కోపంతో వారిని ఘంటియాన్ కెమికల్స్ తీసేసేదే. కానీ.. సగం మందికిపైగా పెళ్లి కాని వారు ఉన్నారు. దాదాపు వారంతా.. మీ కంపెనీలో పని చేయడానికే శక్తి అంతా ఉడిగిపోతోంది.. ఇప్పుడు కొత్తగా కుంపటి పెట్టిస్తానంటే సాధ్యం కాదని కావాలంటే మానేసిపోతామన్నారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం ఆలోచనలో పడింది. పెళ్లి చేసుకుంటే ప్రోత్సహకాలు ఇస్తామని.. మానేయవద్దని చెప్పింది.అయితే ఇక నుంచి ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం ఖచ్ిచతంగా పెళ్లి చేసుకోవాలన్న రూల్ పెట్టాలని నిర్ణయించుకుంది. 

చైనాలో జనాభా సమస్య ఎవరూ ఊహించనంతగా ఉంది. ఒకప్పుడు రెండో బిడ్డను కంటే చైనీయులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యేవి. ప్రభుత్వం టార్చర్ పెట్టేది. రెండో బిడ్డను  పెంచడం అసాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు ముగ్గురు బిడ్డల్ని కంటే ఖర్చులన్నీ భరిస్తామని ఆఫర్ ఇస్తోంది. అంతే కాదు బలవంతంగా పెళ్లిళ్లు చేసి... పిల్లల్ని కూడా కనేలా ఒత్తిడి చేస్తోంది. అందుకే పాపం చైనా అనుకుంటున్నారు అంతా.         

Also Read:  ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని - ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget