అన్వేషించండి

I Love Muhammad row: ఐ లవ్ మహమ్మద్ బ్యానర్ల వివాదం ఏమిటి ? ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి?

I Love Muhammad protests: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’ అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్ల వివాదంలో పోలీసులు కేసు పెట్టడం వివాదాస్పదమయింది. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

What is  I Love Muhammad row: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మీలాద్-ఉన్-నబీ  ఉత్సవాల సందర్భంగా ‘ఐ లవ్ ముహమ్మద్’ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ బ్యానర్‌లపై పోలీసులు 25 మంది ముస్లిం యువకులపై FIR నమోదు చేయడంతో ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లో  నిరసనలు నిర్వహించారు.  కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.    ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛపై దాడిగా చూస్తుంటే, పోలీసులు సామాజిక సామరస్యాన్ని కాపాడటానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తున్నారు.

సెప్టెంబర్ 4న కాన్పూర్‌లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో  ప్రవక్త ముహమ్మద్ జన్మదిన ఉత్సవం సందర్భంగా ముస్లిం సంఘం ‘ఐ లవ్ ముహమ్మద్ ’ అనే లైట్ బోర్డులు, బ్యానర్‌లు ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో సాధారణంగా హిందూ మత  వేడుకలు జరుగుతాయి. ఈ బ్యానర్‌లపై హిందూ సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ SHO కృష్ణ మిశ్ర  ఈ బ్యానర్‌లు సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తాయని, మునుపటి సంవత్సరాల్లో ఇలాంటి ఆచారం లేకపోవడంతో FIR నమోదు చేశారు. 

సెప్టెంబర్ 9న  మత భావాలను గాయపరిచే చర్యలకు పాల్పాడ్డారని కొంత మందిపై కేసులు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యవహరిస్తున్నారని  దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్చా హక్కు  ఉల్లంఘనగా  ఆరోపిస్తున్నారు. FIR తెలిసిన వెంటనే ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో నిరసనలు నిర్వహించారు. . ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు పట్టుకుని, ప్రవక్తపై ప్రేమ వ్యక్తం చేయడం నేరం కాదని   నినాదాలు చేశారు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ "ఇది మత స్వేచ్ఛపై దాడి, మేము భయపడము" అని  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

నిరసనలు కొన్ని చోట్ల ఉద్రిక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.  ‘ఐ లవ్ రామ్’ లేదా ‘ఐ లవ్ ముహమ్మద్’  అని ఆయా వర్గాలు చెప్పం వారి హక్కు అని సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు.   ముస్లిం సంఘాలు "ప్రవక్తపై ప్రేమ వ్యక్తీకరణ నేరం కాదు" అని  చెబుతున్నారు.  పోలీసులు ఉద్రిక్తతలను నివారించడానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తత సృష్టిస్తూండటంతో పలు చోట్ల పోీలసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
CSK Massive Overhaul:  CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Embed widget