Boy Traps Leopard: చిరుతపులి వస్తే ఇంట్లో పెట్టి తాళం వేసిన పిల్లాడు, Video వైరల్
Leopard Viral News: వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్లాడు ధైర్య సాహసాలు ప్రదర్శించి చిరుతపులిని ఇంట్లో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video Telugu News: కళ్ల ముందే చిరుతపులి అలా ఆఫీసులోకి వచ్చేసింది. చూస్తుండగానే లోపలికి వెళ్లిపోయింది. కానీ ఈ పిల్లాడు మాత్రం అస్సలు బెదరలేదు. అరిచి ఆ చిరుతపులికి దొరికి ప్రాణాల మీదకి తెచ్చుకోలేదు. వీడియో గేమ్స్ ఆడుతున్న పిల్లాడు తన చేతిలోని ఫోన్ మెల్లగా పక్కకు పెట్టేసి.. చిరుత లోపలికి వెళ్లగానే ఆఫీసు బయటకు వచ్చేశాడు. అంతే కాదు తలుపు దగ్గరగా చిరుతపులి తిరిగి వెళ్ల లేని విధంగా గడియ పెట్టి (Boy traps Leopard in Room), దాన్ని కట్టడి చేశాడు. ఈ సాహసం చేసిన ఈ పిల్లాడి పేరే మోహిత్ అహిరే. వయస్సు పన్నెండేళ్లు. మహారాష్ట్రలోని మాలేగావ్ లో ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
మోహిత్ అహిర్ తన తండ్రి సెక్యూరీటీ గార్డ్ గా పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లాడు. తండ్రి బయటకు వెళ్లటంతో పక్కనే ఉన్న ఎత్తైన అరుగుపై కూర్చుని వీడియో గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఈ లోగా చిరుతపులి అత్యంత చాకచక్యంగా మోహిత్ దాన్ని బంధించటం జరిగాయి. మొత్తంగా ఆ చిరుతపులిని బంధించి అదుపులోకీ తీసుకున్న అటవీశాఖ అధికారులు పిల్లాడి ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ సీసీటీవీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పేరుకు పసి బిడ్డ కానీ, ధైర్యంలో పులిబిడ్డ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే భయపడటం ఆపేసి, సమయస్ఫూర్తి ప్రదర్శించాలని అందుకు ఈ పిల్లాడి వీడియోను నిదర్శనం అని చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తే మోహిత్ అహిర్ లా ధైర్యంగా ఉండాలని, సమస్యలను ఎదుర్కోవడంతో పాటు వాటిని సులువుగా పరిష్కరించుకోవాలని కామెంట్ చేస్తున్నారు. బాలుడు అతి తక్కువ సమయంలో చురుకుగా ఆలోచించి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని ధైర్య సాహసాలు ప్రదర్శించి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ప్రశంసిస్తున్నారు. సమస్య మన ముందు నిలిస్తే.. ఆందోళన చెందకుండా ఆలోచనలకు పదును పెట్టాలని ఈ వీడియో చూస్తే అర్థమవుతుందన్నారు.