(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Avatar Biryani: సోషల్ మీడియాలో బ్లూ కలర్ బిర్యానీ రెసిపీ వైరల్ అవుతోంది. దీనికి అవతార్ బిర్యానీ అనే పేరు కూడా పెట్టేశారు.
Avatar Biryani Viral Video: బిర్యానీల్లో చాలా రకాలున్నాయి. కానీ అవతార్ బిర్యానీ (Avatar Biryani) గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. జనరల్‌గా బిర్యానీ అంటే ఎల్లో కలర్‌లో ఉంటుంది. కానీ ఓ చెఫ్ దీన్ని బ్లూ కలర్‌లో వండేశాడు. ఇది అచ్చం అవతార్‌లోని పాండా గ్రహంలో ఉండే కలర్ ఇది. అందుకే దీనికి అవతార్ బిర్యానీ అని పేరు పెట్టేశారు నెటిజన్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బిర్యానీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్లాగర్ (Avatar Biryani Viral Video)ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. శంఖం పూలు( Pea Flowers) తీసుకుని వాటి రెక్కలు వేరు చేసింది. ఆ తరవాత ఓ కుండలో నీళ్లు పోసి బాగా ఉడికించింది. ఆ ఉడికి నీళ్లలో శంఖం పూలు వేసింది. సన్నగా మంట పెట్టి కాసేపు ఉడికించింది. ఆ తరవాత ఆ పూలను వేరు చేసింది. అప్పటికి ఆ నీళ్లు నీలం రంగులోకి మారాయి. ఆ తరవాత నానబెట్టిన బియ్యాన్ని అందులో పోసింది. దాదాపు 20 నిముషాల పాటు అలాగే ఉడికించింది. తరవాత అందులో ఉప్పు, నెయ్యి వేసింది. మరో కుండ తీసుకుని అందులో నెయ్యి పోసి సుగంధ ద్రవ్యాలు వేసింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, జీడిపప్పు వేసి కాసేపు వేయించింది. ఆ మసాలాలోనే నీలం రంగులో ఉన్న బియ్యాన్ని పోసింది. కాసేపు ఉడికించిన తరవాత బ్లూ కలర్‌లో బిర్యానీ రెడీ అయిపోయింది.
View this post on Instagram
ఈ వీడియోకి ఇప్పటికే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కామెంట్స్‌లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ ఐడియా ఎలా వచ్చిందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా ఓ యూజర్ "అవతార్ బిర్యానీ" అని కామెంట్ పెట్టాడు. అప్పటి నుంచి దీన్ని అవతార్ బిర్యానీ అని పిలుస్తున్నారు. ఇంకొంత మందైతే ముంబయి ఇండియన్స్ జెర్సీ కలర్‌లో ఉందని పోల్చుతూ MI బిర్యానీ అని పేరు పెట్టేశారు. మలేషియాలోనూ ఇలానే బ్లూరైస్ వండుకుంటామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.