Top Headlines Today: ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ దృష్టి పెట్టలేదా?; నేటి నుంచే లోకేశ్ ఎన్నికల శంఖారావం - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఎమ్మెల్యేల చేరికలపై రేవంత్ దృష్టి పెట్టలేదా?
రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు అవుతున్న ఎమ్మెల్యేలపై రాజకీయవర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై సొంత పార్టీలోనూ పుకార్లు ప్రారంభమయ్యాయి. దీనిపై రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. వారెవరూ పార్టీ మారే ఉద్దేశంతో తన వద్దకు రావడం లేదని.. తాను కూడా వారిని అందు కోసం కలవలేదని చెబుతున్నారు. వారిపై బీఆర్ఎస్ అనుమానాలు పెంచుకుంటే తనకేం సంబంధం లేదన్నారు. చివరికి జగ్గారెడ్డి తమతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్న మాటల్ని కూడా లైట్ తీసుకున్నారు. వారెవరో జగ్గారెడ్డి పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమిటన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. ఇంకా చదవండి
సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి తమ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలు అందలేదని ఫలితంగా పేదలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురైన పరిస్థితి రాకుండా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇంకా చదవండి
నేటి నుంచే లోకేశ్ ఎన్నికల శంకారావం
స్పల్ప విరామం అనంతరం మరోసారి నారా లోకేశ్(Lokesh) నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన లోకేస్ ఇప్పుడు శంఖారావం అంటూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(Ichapuram)లో తొలి బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు భారీ రోడ్ షోలో ఆయన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఇంకా చదవండి
షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చాం, ఇదే రిపీట్ అయితే ఊరుకోము: వైసీపీ ఎమ్మెల్యే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి అయినందునే షర్మిల (YS Sharmila)ను వదిలిపెట్టామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై చేస్తున్న కామెంట్లను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిలను విమర్శిస్తే ఓ సమస్య, విమర్శలకు పదునుపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసినా వారికి సమస్య తప్పదు అన్నట్లుగా ఉంటుంది. ఇంకా చదవండి
నా అంతిమ లక్ష్యం అదే, పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడారు. ఈ సందర్భంగా తన పదేళ్ల పాలనను గుర్తు చేసుకున్నారు. పదేళ్ల పాలనలో దేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రిఫామ్, ట్రాన్స్‌ఫామ్‌లపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పదేళ్లల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనా అభివృద్ది మాత్రం ఆగలేదని తెలిపారు. ఇంకా చదవండి
లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తాం - అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act)పై కేంద్రహోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అవేవీ అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవని అన్నారు. ఇంకా చదవండి
సీబీఎన్ లక్కీ నెంబర్ 23, 'వ్యూహం' విడుదల తేదీ 23
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో 'సినిమాలు' కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన 'యాత్ర 2' సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. మరికొన్ని రోజుల్లో 'వ్యూహం', 'శపథం' వంటి మరో రెండు పొలిటికల్ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇంకా చదవండి
యాత్ర 2 మేకింగ్ వీడియో చూశారా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' తీశారు. వైఎస్సార్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభిమానులనూ మెప్పించారు. 'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటించాడు. ఇంకా చదవండి
ఆ తప్పే Paytm ని ముప్పులోకి తోసిందా?
"పేటీఎమ్ కరో". డిజిటల్ పేమెంట్స్ చేసే (Paytm Crisis) ప్రతి ఒక్కరికీ బాగా వినిపించే టోన్ ఇది. నాలుగైదేళ్ల క్రితం డిజిటల్ లావాదేవీలు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తరవాత వచ్చిన మార్పులతో కొంత మంది ఈ చెల్లింపులకు కాస్త అలవాటు పడ్డారు. కానీ...పెద్ద ఎత్తున మార్పు కనిపించింది మాత్రం కరోనా సమయంలోనే. కరెన్సీ నోట్లతో వైరస్ వస్తుందన్న భయంతో అందరూ క్రమంగా డిజిటల్ లావాదేవీలకు మళ్లారు. అదిగో అలా మొదలైన విప్లవం...దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇంకా చదవండి
ప్రతీకారానికి యువ భారత్ సిద్ధం, అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్(U19 Cricket World Cup final)కు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది నవంబర్ 19న భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సిద్ధమైంది. ఇంకా చదవండి