అన్వేషించండి

Yatra 2 Making Video: యాత్ర 2 మేకింగ్‌ వీడియో చూశారా? - వైఎస్‌ జగన్‌ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూడండి!

Yatra 2 Movie: మొత్తానికి పాజిటివ్‌ టాక్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుంది 'యాత్ర 2'. ఈ క్రమంలో మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) అంటూ స్పెషల్‌ వీడియో వదిలింది మూవీ టీం.

Yatra 2 Making Video: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' తీశారు. వైఎస్సార్ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభిమానులనూ మెప్పించారు. 'యాత్ర' చిత్రానికి కొనసాగింపుగా మహి వి రాఘవ్ తీసిన తాజా సినిమా 'యాత్ర 2'. తండ్రి మరణం నుంచి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలు, సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి న‌టించ‌గా.. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టించాడు.

ఫిబ్ర‌వ‌రి 08న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఏపీ రాజకీయాల ఇతివృత్తంతో తీసిన ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి పాజిటివ్‌ టాక్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుంది ఈ 'యాత్ర 2'. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు చాలా క్లీన్‌గా ఉంద‌ని జ‌గ‌న్ పాత్ర‌లో జీవా జీవించేశాడని చెబుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఆసక్తికర వీడియోను రిలీజ్‌ చేశారు. మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) అంటూ స్పెషల్‌ వీడియో వదిలింది మూవీ టీం.

ఈ వీడియోలో జ‌గ‌న్ పాత్ర‌లో జీవాని సెల‌క్ట్ చేయ‌డం ద‌గ్గ‌ర‌ నుంచి షూటింగ్ ముగింపు వ‌ర‌కు యాత్ర 2 ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. ఇందులో వైఎస్‌ జగన్‌ పాత్రను దించేసేందుకు జీవా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఎంతగా కష్టపడ్డాడో ఇందులో వివరించాడు. ఓ సీఎం పాత్రలో నటించడం ఒక చాలెంజ్‌ అంటూ తమిళ యాక్టర్‌ అయిన తను అసలైన తెలుగు భాష అదీ కూడా పార్లమెంటరి స్లాగ్‌లో మాట్లాడటం ఛాలేంజింగ్‌ అనిపించిందన్నాడు. అంతేకాదు యాత్ర 2 గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా జీవా ఈ వీడియోలో పంచుకున్నాడు. మరి అవేంటో ఇక్కడ చూసేయండి. 

Also Read: హనుమాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ - భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన తేజ సజ్జా! ఎంతంటే..

'యాత్ర 2' కథ విషయానికి వస్తే..

ఈ సినిమా కథ ప్రజలకు తెలియనిది కాదు. కథగా చూస్తే అందరికీ తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని కథనం, సన్నివేశాల్లో మహి వి రాఘవ్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. కథతో కంటే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశారు.  వైయస్సార్ (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. తన కుమారుడు, ఎంపీగా పోటీ చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి (జీవా)ను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పరిచయం చేస్తారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు.

ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్, మేడమ్ (సుజానే బెర్నెర్ట్) రోశయ్యను సిఎం చేస్తారు. ఆ తర్వాత తండ్రి మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కలవడానికి ఓదార్పు యాత్ర చేపడతారు జగన్. అది ఆపేయమని మేడమ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని ధిక్కరించిన జగన్... తాను మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని, యాత్ర చేస్తానని చెబుతారు. ప్రోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపిస్తారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు, 2014 & 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? తెలుగునాడు పార్టీ అధినేత చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) నుంచి జగన్ పార్టీకి ఎటువంటి పోటీ ఎదురైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Story : మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
మహేశ్ బాబు 'వారణాసి' స్టోరీ - రామాయణంలో ఈ కథ మీకు తెలుసా?... విజువల్ వండర్ బిగ్ ట్రీట్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget