అన్వేషించండి

Kona Raghupathi: షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చాం, ఇదే రిపీట్ అయితే ఊరుకోము: వైసీపీ ఎమ్మెల్యే

YSRCP MLA Kona Raghupathi: వైఎస్సార్ కూతురు అయినందునే షర్మిలను బాపట్ల దాటనిచ్చామని, వేరేవాళ్లు అయితే పరిస్థితి వేరేలా ఉండేదంటూ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

YSRCP MLA Kona Raghupathi warns YS Sharmila over her remarks against him: విజయవాడ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి అయినందునే షర్మిల (YS Sharmila)ను వదిలిపెట్టామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై చేస్తున్న కామెంట్లను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిలను విమర్శిస్తే ఓ సమస్య, విమర్శలకు పదునుపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసినా వారికి సమస్య తప్పదు  అన్నట్లుగా ఉంటుంది. బాపట్లలో జరిగిన సభలో సీఎం జగన్, తనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోన రఘుపతి (Kona Raghupathi) మండిపడ్డారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసింది వైఎస్సార్ కూతురు షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చామని.. వేరేవాళ్లయితే పరిస్థితి మరోలా ఉండేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామని, సీఎం జగన్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని.. కానీ షర్మిలను వైఎస్సార్ కూతురు అన్న కారణంగా వదిలేశాం అన్నారు. ఇదే వ్యాఖ్యలు మరొకరు చేసినట్లయితే ఊరు దాటనిచ్చే వాళ్లం కాదన్నారు.

బాపట్లపై జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా? 
షర్మిల రాజకీయం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రోజులు ఎప్పుడో పోయాయంటూ షర్మిలను ఎద్దేవా వేశారు. సోషల్ మీడియా కారణంగా.. చదువున్న వారికి, చదువులేని వారికి అందరికీ విషయాలు తెలుస్తున్నాయన్నారు. బాపట్లలో ఏం అభివృద్ధి జరిగిందని షర్మిల అడగడంపై మండిపడ్డారు. బాపట్లను జిల్లా చేశారని.. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి గతంలో ఎన్నడూలేని విధంగా డెవలప్ చేస్తున్నామని చెప్పారు. బాపట్లపై షర్మిల చేసిన కామెంట్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. మాట్లాడితే ఇసుక దందా అని షర్మిల కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై గతంలోనే తాను స్పందించానని కోన రఘుపతి తెలిపారు. బాపట్లో వాగులు, వంకలు లేవన్నారు. ఇక్కడున్నది ఇసుక కాదని, మూడు లైన్లు, నాలుగు లైన్లు రావడంతో ఇక్కడున్న ఇసుకను కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. 
వైఎస్సార్ కూతురు అని వదిలేశాం, లేకపోతే అంటూ వార్నింగ్
రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఏదో అనాలి కనుక అంటాం.. కోన రఘుపతిని ఇంకేం అనాలో తెలియక షర్మిల లేనిపోని ఆరోపణలు, కామెంట్లు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. షర్మిల తన గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని, కానీ వైఎస్సార్ కూతురు కనుక ఆమెను ఊరు దాటనిచ్చామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, ఇంకోసారి ఇలా వదిలేయం జరగదని హెచ్చరించారు. వైఎస్సార్ కుటుంబాన్ని చూసి, వారిపై ఉన్న గౌరవంతో వదిలేశామే కానీ, చేతకాక కాదని పేర్కొన్నారు. మీ పిచ్చి మాటలకు, ఉడత ఊపులకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులు ఎంత మంది వచ్చినా, పెయింగ్ గెస్ట్‌లు ఎంత మంది వచ్చినా వైఎస్సార్ సీపీని, వైఎస్ జగన్‌ను ఏం చేయలేరంటూ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటుగా స్పందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget