అన్వేషించండి

RGV's Vyooham: సీబీఎన్ లక్కీ నెంబర్ 23, 'వ్యూహం' విడుదల తేదీ 23: రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్

RGV Vyooham: 'వ్యూహం' సినిమా విడుదల నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసారు. సీబీఎన్ కు 23కు లింక్ చేస్తూ పెట్టిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Ram Gopal Varma's Vyooham: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో 'సినిమాలు' కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన 'యాత్ర 2' సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. మరికొన్ని రోజుల్లో 'వ్యూహం', 'శపథం' వంటి మరో రెండు పొలిటికల్ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్‌ఆర్ మరణం తర్వాత పరిస్థితులు, జగన్ అరెస్ట్‌, రాష్ట్ర విభజన, ఓదార్పు యాత్ర, జగన్ సీఎం అవ్వడం వంటి అంశాలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు ఫిక్షనల్ రియాలిటీ సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని 'వ్యూహం' పేరుతో, రెండో భాగాన్ని 'శపథం'గా ప్రేక్షకుల ముందుకి తీసుకురబోతున్నారు. వ్యూహం సినిమాకు అన్నిఅడ్డంకులు తొలగిపోవడంతో, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వర్మ ప్రచారం ముమ్మరం చేశారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో సీబీఎన్ ను టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ మొదలుపెట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, 23 నంబర్ తో లింక్ చేస్తూ అధికార వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఏపీ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు అదే అంశాన్ని లేవనెత్తుతూ ఆర్జీవీ 'వ్యూహం' చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. తన సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుందని ప్రకటించిన వర్మ.. 'సీబీఎన్ 23 సెంటిమెంట్'ను గుర్తు చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతున్న 4 కల్ట్ లవ్ స్టోరీలు!

'CBN లక్కీ నెంబర్  23' అంటూ స్టార్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది అని పేర్కొన్నారు. 2019లో ఎన్నికల ఫలితాల్లో తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23.. బాబు గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23. బాబు అరెస్టయిన తేదీ(9-9-23) సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ 23.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 సెప్టెంబర్ 23 వరకూ సీబీఐ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చింది. బాబు ప్రిజన్ నెంబర్ 7691 - సమ్ అఫ్ ఆల్ నంబర్స్ 23.. NTR దగ్గర నుంచి సీబీఎన్ తను లాక్కున్న  పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టిన రోజు 23. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23న జరగబోతోంది.. సినిమా 23న రిలీజ్ కాబోతోంది అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు ఆర్జీవీ.

నిజానికి 'వ్యూహం' సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు అనుమ‌తి ఇచ్చినప్పటికీ, త‌మ‌ను కించ‌ప‌రిచేలా సినిమా తీశార‌ని ఆరోపిస్తూ నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుద‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను ర‌ద్దు చేసింది. దీంతో సినిమా వాయిదా పడింది. అయితే సదరు తీర్పును సవాలు చేస్తూ, వ్యూహం మేకర్స్ డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లారు. కోర్టు సూచనతో మ‌రోసారి మూవీని వీక్షించిన బోర్డు సభ్యులు.. 'యూ' స‌ర్టిఫికెట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

సెన్సార్ లైన్ క్రియర్ చేయడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చెయ్యాలని వర్మ డిసైడ్ అయ్యారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు దగ్గరగా ఉన్న థియేటర్లలో తన సినిమా రిలీజ్ అవుతుందంటూ ఇప్పటికే టీజింగ్ షురూ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు '23' నంబర్ తో లింక్ చేస్తూ పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దేనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక 'శపథం' చిత్రాన్ని మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ప్రకటించారు. 

Also Read: బుల్లితెరపై రామ్ ర్యాంపేజ్.. డిజాస్టర్ సినిమాలకూ డీసెంట్ టీఆర్పీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget