Ram Pothineni: బుల్లితెరపై రామ్ ర్యాంపేజ్.. డిజాస్టర్ సినిమాలకూ డీసెంట్ టీఆర్పీ!
Ram Pothineni: ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. బిగ్ స్క్రీన్ మీద ప్లాప్ అయిన సినిమాలు కూడా బుల్లితెరపై హిట్ అవుతున్నాయి.
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. టైర్ 2 హీరోగా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కథల ఎంపికలో లోపమో, స్కిప్ట్ సెలక్షన్ లో వేరియేషన్ చూపించాలనే తాపత్రయమో తెలియదు కానీ.. వరుసగా హిట్లు కొట్టలేకపోతున్నారు. అయితే రాపో నటించిన సినిమాలు బిగ్ స్క్రీన్ మీద ప్లాప్ అయినా, స్మాల్ స్క్రీన్ లో హిట్ అవుతున్నాయి. ఆయన డిజాస్టర్ సినిమాలు సైతం టీవీల్లో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన చిత్రం 'స్కంద: ది ఎటాకర్'. డ్యూయెల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో ఊరమాస్ గెటప్ లో కనిపించారు. 2023 సెప్టెంబర్ లో విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. సోషల్ మీడియాకి కావాల్సినంత ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చింది. అయితే థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమాని ఇటీవల తొలిసారిగా టీవీలో టెలికాస్ట్ చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చింది.
'స్కంద' సినిమాని స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. దీనికి 8.47 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక డిజాస్టర్ మూవీకి ఈ రేంజ్ రేటింగ్స్ అంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలకు టీవీల్లో మంచి ఆదరణ ఉంటుంది. 'వినయ విధేయ రామ' లాంటి భారీ డిజాస్టర్ చిత్రానికి కూడా మంచి టీఆర్పీ వచ్చింది. మరోవైపు రామ్ పోతినేని సినిమాలకు కూడా టీఆర్పీ రేటింగ్స్ బాగుంటాయి. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ లో రామ్ క్రేజ్ ఏంటనేది ప్రూవ్ అయింది.
Also Read: బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుందా? చైతన్య నెక్స్ట్ మూవీ డైరెక్టర్ అతనేనా?
రామ్ నటించిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు 16.6 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అదే సమయంలో 'ది వారియర్' లాంటి డిజాస్టర్ మూవీకి 10.02 రేటింగ్ రావడం విశేషం. 'శివమ్' (10.38), 'పండగ చేసుకో' (11.5), 'హలో గురూ ప్రేమ కోసమే' (8.7), 'ఉన్నది ఒకటే జిందగీ' (7.93) లాంటి మరికొన్ని సినిమాలు బుల్లితెరపై ఉస్తాద్ హీరోకి ఉన్న ప్రేక్షకాదరణను నిరూపిస్తాయి.
ఇక నార్త్ ఆడియన్స్ లోనూ రామ్ పోతినేనికి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతీ సినిమా హిందీలోకి డబ్ కాబడి, మిలియన్ల కొలదీ వ్యూస్ రాబడుతుంటాయి. యూట్యూబ్ లో 2 బిలియన్ల వ్యూస్ అందుకున్న మొదటి హీరోగా, ఏకైక సౌత్ హీరోగా రామ్ పేరిట రికార్డ్ కూడా ఉంది. రాపో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇది 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.
Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతున్న 4 కల్ట్ లవ్ స్టోరీలు!