అన్వేషించండి

Valentine's 2024 Re-Releases: వాలెంటైన్స్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతున్న 4 కల్ట్ లవ్ స్టోరీలు!

Valentines Day 2024 Re Releases: వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించబడిన నాలుగు ప్రేమ కథలను వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Valentine's 2024 Re-Releases:  ప్రేమికుల దినోత్సవం.. ప్రేమను సెలబ్రేట్‌ చేసుకునే ఒక ప్రత్యేక సందర్భం. గుండెల్లో దాచుకున్న ప్రేమను, మాటల్లో చెప్పలేని భావాలను వెల్లడించే రోజు. ప్రేమికులు తమ ప్రేమను బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, ఇతర మార్గాల్లో వ్యక్తపరుస్తుంటారు. ఇక ఈ వాలెంటైన్స్ డేని మరింత స్పెషల్ గా మార్చడానికి, సినీ అభిమానులకు కొన్ని కల్ట్ లవ్ స్టోరీలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఏకంగా నాలుగు సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఓయ్’:
2009లో బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పుడు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా కలెక్షన్స్ రాబట్టలేదు. కానీ తర్వాత రోజుల్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. 'ఎ వాక్ టు రిమెంబర్' అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా ఓయ్ సినిమా రూపొందింది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.

సీతారామం’:
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించింది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. అలాంటి చిత్రాన్ని రెండేళ్లు తిరక్కుండానే మళ్లీ విడుదల చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

సూర్య S/O కృష్ణన్’:
సూర్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన హీరోయిన్లుగా నటించారు. 2008లో విడుదలయిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నేటికీ ఎక్కడో చోట ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాని గతేడాది ఆగస్టులో రీ రిలీజ్ చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య స్పందన లభించింది. ఎవరూ ఊహంచని విధంగా కొత్త సినిమా రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. అయితే ఆరు నెలల గ్యాప్ లో మళ్లీ ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేస్తుండటం గమనార్హం.

'తొలిప్రేమ':
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం 'తొలి ప్రేమ' (1998). ఇది పవన్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.. మైలురాయి మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికే అనేకసార్లు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యగా.. ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాకపోతే అన్ని ఏరియాల్లో కాకుండా, పీవీఆర్ ఐనాక్స్ లో కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్లలో మాత్రమే విడుదల చేయనున్నారు. ఎ. కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. మంచి ప్రేమకథతో పాటుగా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. దేవా సమకూర్చిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Also Read: బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుందా? నాగ‌చైత‌న్య నెక్స్ట్ మూవీ డైరెక్ట‌ర్ అతనేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget