అన్వేషించండి
Advertisement
U19 World Cup Final Preview: ప్రతీకారానికి యువ భారత్ సిద్ధం, అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్
U19 World Cup Preview India v Australia: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
IND vs AUS U19 World Cup Final: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్(U19 Cricket World Cup final)కు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది నవంబర్ 19న భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సిద్ధమైంది.
ఉదయ్ సహారాన్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, సౌమ్‌కుమార్ పాండేలతో బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం కంగారులకు అంత తేలిక కాదు. తాము ప్రతీకారం గురించి ఆలోచించడం లేదని.. గతం గురించి కూడా ఆలోచిచడం లేదని... తమ దృష్టంతా వర్తమానంపైనే ఉందని భారత సారధి ఉదయ్ సహారన్ తెలిపాడు. కంగారు జట్టులో కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తున్నారు. 2012, 2018ల్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించింది. మరోసారి అదే ఫలితం పునరావృతం కావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
బలంగా ఇరు జట్లు
భారత్, ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మధ్య గట్టి పోరు తప్పదని భావిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రికార్డు స్థాయిలో 9వ సారి ఫైనల్స్‌కు చేరుకోగా, ఆస్ట్రేలియన్ జట్టు ఆరోసారి ఫైనల్ చేరింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో రెండుసార్లు తలపడగా, ఈ రెండు మ్యాచులలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడుకూడా ఆ విజయ పరంపరను కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఫిబ్రవరి 11 ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్...స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రారంభం కానుంది.
అండర్ 19 ప్రపంచకప్ లో వరుసగా ఐదోసారి ఫైనల్ చేరిన భారత జట్టు రికార్డు సృష్టించింది. మొత్తం మీద తొమ్మిదో సారి అండర్ 19 ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించింది. 2016, 2018, 2020, 2022, 2024 అండర్ 19 ప్రపంచకప్పుల్లో యువ భారత జట్టు వరుసగా ఫైనల్‌కు చేరింది. 2018, 2022 ఎడిషన్‌లలో కప్పును ఒడిసిపట్టిన టీమిండియా.... 2016, 2020లలో ఓడిపోయింది. 2024లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి కప్పును గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా చూస్తోంది.
టీమిండియా జట్టు:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ రావు, సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.
ఆస్ట్రేలియా జట్టు: హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహ్లీ బార్డ్‌మ్యాన్, టామ్ కాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్, సామ్ కాన్స్టాస్, రాఫెల్ మాక్‌మిలన్, ఐడాన్ ఓ'కానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లెర్, ఒల్లీ పీక్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement