అన్వేషించండి

Top Headlines Today: విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్‌ ముందు ఉన్న టాస్క్ ఏంటీ? ముందస్తు ఎన్నికలపై పవన్‌కు క్లారిటీ ఉందా?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

 

పవన్‌కు ఆ విషయంలో క్లారిటీ ఉన్నట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనసేనాని మాత్రం నింపాదిగా ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ సిటీలో  వారాహి విజయయాత్ర చేపట్టారు. అద్భుతమైన స్పందన వచ్చిందని జనసైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కల్యాణ్. కుటుబంంతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండు వారాల పాటు ఆయన కీలక సినిమా షూటింగ్‌లో ఉంటారని చెబుతున్నారు. అంటే.. ఈ నెలలో మరో రెండు వారాల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు.  డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో  జనసేనాని ఇంత నింపాదిగా ఉండటం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అసంతృప్తిని చల్లారుస్తారా?

టిక్కెట్ రాని నేతలు, పార్టీ మారిపోతామని లీకులిస్తున్న  నేతలు, తాడోపేడో తేల్చుకుంటామని అంతర్గత వార్నింగ్‌లు ఇస్తున్న నేతలు, కుల సంఘాల సాయంతో పార్టీపై ఒత్తిడి తెస్తున్న నేతలుఇప్పుడు బీఆర్ఎస్‌లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారు. పార్టీ కోసం సుదీర్ఘంగా పని చేస్తున్నా తమకు టిక్కెట్ ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంత మంది సీనియర్లు ఉన్నారు. చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎందుకు వారినే కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే టిక్కెట్ లిస్ట్ ప్రకటనకు ముందే కేటీఆర్ అమెరికా వెళ్లడంతో అసంతృప్తికి గురైన వారిని  బుజ్జగించేందుకు ఎవరూ లేరు. కేసీఆర్ ఆ టాస్క్ తీసుకోలేదు. దీంతో అందరూ కేటీఆర్ రాక కోసం ఎదరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చేశారు. బీఆర్ఎస్ అసలు టాస్క్ ప్రారంభమయిందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తెలికపాటి వర్షాలు పడే ఛాన్స్

నిన్నటి ఆవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశాలోని మధ్య బాగాలు & పరిసరాల్లోని ఛత్తీస్ గఢ్ వద్ద కేంద్రీకృతమై సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు షీయర్ జోన్ (ద్రోణి) 19° N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టంకి 3.1కిమీ నుండి 7.6 కి.మీ. మధ్యలో కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వారితోనే సమస్య 

వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన నర్సాపురం మండలంలో పాదయాత్ర చేశారు. అనంతరం సరిపల్లిలో అగ్నికుల క్షత్రియులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ కష్టాలను ఆయనకు వివరించారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దామాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశాలు ఇవ్వాలని అగ్నికుల క్షత్రియులు కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మెడికల్ కాలేజీలు ప్రారంభం

తెలంగాణలో మరో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు, విద్యార్థులకు వైద్యవిద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 15న కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వరి సాగు వద్దు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి చర్చనీయాంశంగా వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వరిసాగు చేయవద్దని సూచించారు. వర్షాలు తక్కువగా పడటంతో సాగర్ లో ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని వరి సాగుపై రైతులు ఆలోచించుకోవాలని అన్నారు. సాగర్ ఆయకట్టు కింద ఈసారి ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంట వేయొద్దని చెప్పారు. నాగార్జున సాగర్ నీటిపై ఆధారపడిన భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవడం తప్ప శరణ్యం లేదని అన్నారు. వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీనిపై ఈ నెల 1న ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎమ్మెల్యేలకు దీదీ శుభవార్త 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ గురువారం రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభలో ఇవాళ ప్రకటన చేశారు దీదీ. ఒక్కొక్కరికీ నెలకు రూ. 40 వేలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జీతంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ.. ఎలాంటి జీతమూ తీసుకోకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ సభ్యుల జీతాలు తక్కువగా ఉన్నాయని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దీదీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వాన గండం 

క్రికెట్ అభిమానులకు చేదువార్త! దాయాదుల సమరాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్న వారి ఆశలు అడియాసలే కానున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్‌ థ్రిల్లర్‌ను కన్నులారా వీక్షించే అవకాశం కనిపించడం లేదు. భారత్‌, పాక్‌ సూపర్‌ 4 మ్యాచుకు వానగండం పొంచివుంది. వరుణదేవుడు అభిమానులను ఏమాత్రం కనికరించేలా లేడు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బిగ్‌బాస్‌ 7లో ఇదే గాసిప్‌

బిగ్ బాస్ అంటే గొడవలు, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు గ్రూప్స్, గాసిప్స్ కూడా. ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో కచ్చితంగా ఒక లవ్ బర్డ్స్ కపుల్ ఉంటారు. ఇక బిస్ బాస్ సీజన్ 7లో చాలామంది యూత్ ఉండడంతో ఈసారి ఆ కపుల్ ఎవరు అని అనుమానాలు మొదటినుండే ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే అప్పుడే బిగ్ బాస్ హౌజ్‌లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ అని, తనకు పెయిర్ అయ్యే వంటలక్క.. శోభా శెట్టినే అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఈ గాసిప్‌ను స్వయంగా బిగ్ బాస్‌తో కూడా షేర్ చేసుకున్నారు కొందరు కంటెస్టెంట్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

షారుక్‌ మేనేజర్‌ ఆస్తులు సంగతి తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా వాళ్ళు లేకుండా ఏ పనీ పని జరగదు. హీరో హీరోయిన్లకు నిర్మాతకు మధ్య వారధుల్లాగా ఉంటారు పర్సనల్ మేనేజర్లు. నటీనటుల డేట్స్ దగ్గర నుంచి రెమ్యునరేషన్ల వరకూ అన్ని వ్యవహారాల్లోనూ వీరి ప్రాధాన్యత ఉంటుంది. మేనేజర్లు చెప్పినట్లే వినే యాక్టర్లు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో అయితే స్టార్ యాక్టర్స్ కు మేనేజర్లను అందించే ఏజెన్సీలు ఎన్నో ఉంటాయి. అందరు హీరోల్లాగానే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు కూడా పర్సనల్ మేనేజర్ ఉన్నారు. ఆమె పేరు పూజా దద్లానీ. షారుక్ ను ఫాలో అయ్యేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే పూజకు షారుక్ ఎంత చెల్లిస్తాడు? ఆమె ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget