అన్వేషించండి

Medical Colleges: సెప్టెంబర్‌ 15న మరో తొమ్మిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం, 26కు చేరిన కళాశాలల సంఖ్య

తెలంగాణలో మరో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 15న కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. 

తెలంగాణలో మరో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు, విద్యార్థులకు వైద్యవిద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 15న కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో గురువారం(సెప్టెంబర్‌ 7న) వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది రాష్ట్రంలో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది మరో తొమ్మిది ప్రారంభమవుతున్నాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించే తొమ్మిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్,  సిరిసిల్ల, వికారాబాద్, జనగామ వైద్య కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశం ఏర్పాటు చేసి.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు.

అప్పుడు 5, ఇప్పుడు 26..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతంలో కేవలం అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా.. తాజాగా ప్రారంభించే 9 కాలేజీలు కలిపి 26కు చేరనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త కాలేజీల రాకతో కొత్తగా 900 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. 2014లో అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా 850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 3,915 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

స్టాఫ్‌నర్సుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలి..
గత నెలలో 5,204 స్టాఫ్‌నర్సుల నియామకానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అయిదు కొత్త డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను త్వరగా ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ALSO READ:

సెప్టెంబరు 8 నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 8 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు సెప్టెంబరు 9 - 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది. సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.
ఐసెట్ పూర్తి షెడ్యూలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

అక్టోబర్‌ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget