Shah Rukh Khan’s Manager: షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజా సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
'జవాన్' సినిమా గ్రాండ్ గా రిలీజైన నేపథ్యంలో ఆయన మేనేజర్ పూజా దద్లానీకి సంబంధించిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె వార్షిక ఆదాయం ఎంతో తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా వాళ్ళు లేకుండా ఏ పనీ పని జరగదు. హీరో హీరోయిన్లకు నిర్మాతకు మధ్య వారధుల్లాగా ఉంటారు పర్సనల్ మేనేజర్లు. నటీనటుల డేట్స్ దగ్గర నుంచి రెమ్యునరేషన్ల వరకూ అన్ని వ్యవహారాల్లోనూ వీరి ప్రాధాన్యత ఉంటుంది. మేనేజర్లు చెప్పినట్లే వినే యాక్టర్లు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో అయితే స్టార్ యాక్టర్స్ కు మేనేజర్లను అందించే ఏజెన్సీలు ఎన్నో ఉంటాయి. అందరు హీరోల్లాగానే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు కూడా పర్సనల్ మేనేజర్ ఉన్నారు. ఆమె పేరు పూజా దద్లానీ. షారుక్ ను ఫాలో అయ్యేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే పూజకు షారుక్ ఎంత చెల్లిస్తాడు? ఆమె ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్ గా భారీగానే ఆర్జిస్తోంది. ముంబై రిచ్ కపుల్స్ అయిన షారూఖ్ - గౌరీ జంట.. మేనేజర్ పూజా దద్లానీ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పూజా 2012 నుండి కింగ్ ఖాన్ మేనేజర్ గా ఉన్నారు. ఒక దశాబ్ద కాలంగా అంకితభావంతో పని చేస్తూ, అతని ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. ఆమె షారూఖ్ సినిమా వ్యవహారాలే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటుంది. తన కష్టానికి తగ్గట్టుగానే ప్రతిఫలం అందుకుంటుందని తెలుస్తోంది. 'జవాన్' మూవీ ప్రమోషన్స్ లో పూజా కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆమె సాలరీ గురించిన విషయాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువ ఉంటుందనే టాక్ ఉంది. ఆమె సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూజా రూ. 7 కోట్ల నుండి 9 కోట్ల రూపాయల వరకు వార్షిక ఆదాయం సంపాదిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో పాటుగా ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తుందని తెలుస్తోంది. SRK క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, హోమ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లోనూ దద్లానీ భాగం పంచుకుంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
పూజా దద్లానీకి షారుక్ తోనే కాదు ఆయన ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. ఆమె గౌరీ ఖాన్ కు మంచి సన్నిహితురాలు కూడా. తరచుగా వారితో కలిసి సెలబ్రిటీ పార్టీలకు వెళ్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసే గౌరీ.. తన మేనేజర్ ఇంటికి డిజైనర్ గా వర్క్ చేసిందంటే వారి మధ్య ఫ్రెండ్ షిప్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఖాన్ కపుల్స్ ఇద్దరికీ ఆమె నమ్మకమైన స్నేహితురాలు, సలహాదారు అని చెప్పాలి. ఆ ఫ్యామిలీలో సమస్యలు వచ్చినప్పుడు, కష్ట సమయాల్లోనూ షారూఖ్‌కు పూజా మోరల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుంది.
ఇక షారుక్ ఖాన్ పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్ రామ్‌లతోనూ పూజా దద్లానీకి మంచి సాన్నిహిత్యం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసే ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు పూజానే బయట అన్ని విషయాలు చూసుకుంది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించినప్పుడు, పూజా భావోద్వేగానికి గురై కోర్టులో ఏడుస్తూ కనిపించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. కాబట్టి, పూజా దద్లానీ కేవలం మేనేజర్ మాత్రమే కాదు, ఖాన్ ఫ్యామిలీలో ఒక భాగమని అనొచ్చు. ఇటీవల షారుక్ తన కుమార్తెతో కలిసి తిరుపతిలోని శ్రీవారిని దర్శించుకున్నప్పుడు కూడా ఆమె వారి వెంటే నడిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి చేసాయి.
పూజా దద్లానీ ఫ్యామిలీ విషయానికొస్తే, ఆమె దియా మీర్జా రెండవ భర్త, వ్యాపారవేత్త వైభవ్ రేఖీకి దగ్గరి బంధువు అనే నివేదికలు ఉన్నాయి. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకుంది. వీరికి రేనా దద్లానీ అనే కూతురు కూడా ఉంది.
View this post on Instagram
View this post on Instagram