అన్వేషించండి

Janasena : నింపాదిగా జనసేనాని - జమిలీ ఉండదని గట్టిగా నమ్ముతున్నారా ?

జనసేనాని ఎన్నికల విషయంలో ఎందుకంత నింపాదిగా ఉన్నారు ? ఎలక్షన్ ఫీవర్ వచ్చేసినా షూటింగ్‌లకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారు ?


Janasena :  ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలు చేసుకుంటున్నాయి. కానీ జనసేనాని మాత్రం నింపాదిగా ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ సిటీలో  వారాహి విజయయాత్ర చేపట్టారు. అద్భుతమైన స్పందన వచ్చిందని జనసైనికులు సంతోషపడ్డారు. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు పవన్ కల్యాణ్. కుటుబంంతో గడపేందుకు కొన్నాళ్లు విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండు వారాల పాటు ఆయన కీలక సినిమా షూటింగ్‌లో ఉంటారని చెబుతున్నారు. అంటే.. ఈ నెలలో మరో రెండు వారాల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు.  డిసెంబర్ లో జమిలీ ఎన్నికలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో  జనసేనాని ఇంత నింపాదిగా ఉండటం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 

పొత్తులు ఖాయమని చెబుతున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పొత్తులు ఖాయమని చెబుతున్నారు. తమకు  బలం ఉన్న చోటనే పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. కానీ రాజకీయాల్లో ప్లాన్ ఏ .. ప్లాన్ బీ కూడా ఉండాలని చెబుతూంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా... రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధపడాలి. అందు కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ పవన్ కల్యాణ్ ..  ఈ విషయంలో అంత చురుకుగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఆయన రెండు, మూడు వారాల పాటు పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్లడంతో పార్టీకి సరైన దిశానిర్దేశం ఉండటం  లేదు. పార్టీలో నెంబర్ టు గా ఉన్న నాదెండ్ల మనోహర్ వీలైనంత వరకూ.. పార్టీ స్టాండ్ ను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెబుతున్నారు కానీ.. క్షేత్ర స్థాయిలో పార్టీని యాక్టివ్ గా ఉంచడం శక్తికి మించిన పని అవుతోంది. 

చివరి వారం నుంచి వారాహి యాత్ర ఉండే అవకాశం

పవన్ కల్యాణ్.. ఈ నెల చివరి వారం నుంచి మరోసారి వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖ సిటీలో యాత్ర పూర్తయినందున ఈ సారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాత్ర కొనసాగించే అవకాశం ఉంది. ప్రతీ నెలా రెండు వారాలు సినిమా షూటింగ్‌లకు కేటాయించాలని ఇది వరకే నిర్ణయించారు. ఎన్నికలకు ముందే ఓజీ, ఉస్తాద్ సినిమాలను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఓజీ సినిమాతో పాటు ఉస్తాద్ లోనూ పొలిటికల్ పంచ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ సినిమాలు కూడా జనసేనకు ప్రచారం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సగం రోజులు షూటింగ్‌లకు కేటాయిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఎన్నికలు అంటే చిన్న విషయం కాదని.. పార్లమెంట్ సమావేశాల్లో జమిలీపై స్పష్టత వస్తే పూర్తి సమయం ఎన్నికల కోసం కేటాయించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

జమిలీ రాదని జనసేనాని నమ్ముతున్నారా ?

ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ముందు నుంచీ..  ఏపీలో ముందుగానే ఎన్నికలు వస్తాయని.. కేంద్ర పెద్దలు తనకు చెప్పారని.. ఎన్నికల సంఘం ఈ మేరకు సన్నాహాలు చేస్తోందని గతంలో పవన్ ప్రకటించారు. కానీ ఆయనే మళ్లీ ఈ అంశంపై స్పష్టత కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నెలలో సగం రోజులు షూటింగ్‌కు కేటాయిస్తే..  కేడర్ లోనూ అంత సీరియస్ నెస్ ఉండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.                    

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget