Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
బీజేపీ డైలమా
తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది కానీ ఎదగడం లేదు. దేశం మొత్తం ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు అయింది పరిస్థితి. అధికారానికి పోటీ పడుతున్నట్లుగా కనిపించినా తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో అయితే చెప్పాల్సిన పని లేదు. అయితే హైకమాండ్ వ్యూహాలు, ఢిల్లీ బీజేపీ రాజకీయాల కోసమే తెలుగు రాష్ట్రాల బీజేపీని .. హైకమాండ్ బలిపశువుల్ని చేస్తోందన్న అభిప్రాయం ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ధరణిపై రాజకీయం
ధరణి పోర్టల్ వివాదం తెలంగాణలో పెను రాజకీయ ప్రకంపనలనే రేపుతోంది. ఇటీవల నిర్మల్ కలెక్టరేట్ ప్రారంభం, నాగర్ కర్నూల్ లో కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పై చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రతిపక్ష పార్టీలలో కాకరేపుతున్నాయి. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేద్దాం అన్న పార్టీలనే బంగాళాఖాతంలో కలిపేయాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై అగ్గిమీద గుగ్గిలంలా రెచ్చిపోయారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ గ్రామీణ స్థాయిలో అవినీతి వ్యవస్థకు చెక్ పెట్టిందని కేసీఆర్ అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఉద్యోగి సాహసం
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొత్తూరులో మహిళా వీఆర్వో మీనా సాహసం చేశారు. చేతిలో తన బిడ్డను ఎత్తుకుని, అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకున్నారు. ఈ ఘటన స్దానికంగా సంచలనం రేకెత్తించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మరో కీలక మలుపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టు జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అందుకే నిన్ హైడ్రిన్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం .. నిన్ హైడ్రిన్ టెస్టును వ్యతిరేకించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం తాజాగా ఏకీభవించింది. నిన్ హైడ్రిన్ పరీక్ష జరిపితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ చెబుతోంది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకొచ్చింది.. కోర్టు రికార్డులలో ఉంచేందుకు ఈ లేఖ కలర్ జిరాక్స్ కు అనుమతి ఇవ్వవలసిందిగా అభ్యర్ధించింది.. దీనికి కూడా సిబిఐ ఓకే చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు ఫలితాలు
తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్) -2023 ఫలితాలు గురువారం (జూన్ 8న) విడుదల కానున్నాయి. జూన్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
దూసుకెళ్లుడే
హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దీని కారణంగా జూన్ 14వ తేదీన కొత్త ఆర్డీఈ నిబంధనలతో తను అప్‌డేట్ చేసిన బైక్ Xtreme 160R మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్‌లో కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ట్రెండీగా ఉండే పురాతన పథకం
దేశంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను (Post Office Scheme) తీసుకువస్తూనే ఉంటుంది. వాటితో చాలా ప్రయోజనాలు పొందొచ్చు. పైగా, ఆ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి పెట్టుబడి నష్ట భయం ఉండదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మరో ప్రమాదం
బహంగా రైలు ప్రమాదం ఇంకా మర్చిపోక ముందే ఒడిశాలో బుధవారం (జూన్ 7) మధ్యాహ్నం మరో ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్-కెందుఝర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఉండి ఆరుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చూక్కలతో చూపు
కంటి చూపు మెరగ్గా ఉండాలంటే బాల్యం నుంచే అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు పౌష్టికాహరం అందించడం, బ్లూరేస్ వెదజల్లే బ్లూస్క్రీన్స్ నుంచి దూరంగా ఉంచడం ద్వారా కంటి చూపును కాపాడవచ్చు. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పిల్లలు చూపు కోల్పోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మూడేళ్లపాటు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలను తెలుసుకున్నారు. కంటిలో తక్కువ మోతాదులో అట్రోపి చుక్కలు వాడడం వల్ల హస్వ దృష్టి లోపంతో బాధపడుతున్న పిల్లల్లో కంటి చూపు మెరుగవుతుందని కనుగొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కంగారులదే కేక
భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో మొదటి రోజు ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట్ చేసింది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 బ్యాటింగ్: 156 బంతుల్లో, 22 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ స్మిత్ (95 బ్యాటింగ్: 227 బంతుల్లో, 14 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. రెండో రోజు ప్రారంభంలో వీరి వికెట్ తీయకపోతే టీమిండియాకు పరిస్థితులు మరింత క్లిష్టం అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి