News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

వివేకా లెటర్ కు నిన్ హైడ్రిన్ టెస్టు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

FOLLOW US: 
Share:

YS Viveka Case :   మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టు జరిపేందుకు సీబీఐ కోర్టు  అనుమతి మంజూరు చేసింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అందుకే నిన్ హైడ్రిన్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ..  నిన్ హైడ్రిన్ టెస్టును వ్యతిరేకించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత  సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం తాజాగా ఏకీభవించింది.  నిన్ హైడ్రిన్ పరీక్ష జరిపితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ చెబుతోంది. ఇదే విష‌యాన్ని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకొచ్చింది.. కోర్టు రికార్డుల‌లో ఉంచేందుకు ఈ లేఖ క‌ల‌ర్ జిరాక్స్ కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ల‌సిందిగా అభ్య‌ర్ధించింది.. దీనికి కూడా సిబిఐ ఓకే చెప్పింది.
 
నిన్ హైడ్రేట్ టెస్ట్ అంటే ఏమిటంటే ? 

కాగితం లేదా కార్డ్ బోర్డ్ వంటి వాటిపై  ఉపరితలాలపై గుప్త వేలిముద్రలను గుర్తించడానికి నిన్ హైడ్రేట్ టెస్టును నిర్వహిస్తారు. ఇది సాధారణ ఫోరెన్సిక్ టెస్టులకు దొరకని ఆనవాళ్లను కూడా గుర్తిస్తుంది. కొన్ని రసాయనప్రక్రియ ద్వారా ఈ టె్ట్ నిర్వహిస్తారు. అత్యంత నిపుణులు చేసే ఈ టెస్టు ద్వారా.. ఆ లేఖలో ఉన్న వేలి ముద్రలు.. ఇతర గుర్తులన్నింటినీ వెలికి తీసే అవకాశం ఉంది. ఈ టెస్టు నిర్వహించాలని  సీబీఐ నిర్ణయించడం ఆసక్తి కరంగా మారింది. 

ఇప్పటికే ఫోరెన్సిక్ టెస్ట్ చేయించిన సీబీఐ 
  
మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆయనే రాశారంటూ వెలుగులోకి వచ్చిన లేఖ.. ఆయన్ని కొడుతూ.. ఆయన అభీష్టానికి విరుద్ధంగా రాయించినట్లు ఉందని సీబీఐ ఇప్పటికే కోర్టుకు తెలిపింది.  తప్పనిసరి పరిస్థితులు, ఇతరుల ఒత్తిడి మధ్య ఆయన ఈ లేఖ రాసినట్లు ఉందని వెల్లడించింది. అందుకే ఆయన చేతిరాత అస్పష్టంగా, గజిబిజిగా కనిపిస్తోందని తెలిపింది. లేఖలోని చేతిరాతను ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలలో ఫోరెన్సిక్‌ సైకలాజికల్‌ విశ్లేషణ (ఎలాంటి పరిస్థితుల్లో లేఖ రాశారో తెలుసుకోవడానికి) చేయించిన సీబీఐ అధికారులు ఆ సంస్థ నుంచి నివేదిక తీసుకున్నారు. ఈ కేసులో ఇటీవల దాఖలుచేసిన అభియోగ పత్రంతో పాటు న్యాయస్థానానికి సీబీఐ సమర్పించింది.  

లేఖలోని చేతిరాతను విశ్లేషిస్తే .. రాసినప్పుడు పెన్ను, మెదడు మధ్య సమన్వయం లేదని రిపోర్ట్‌లో తేలిందని సీబీఐ పేర్కొంది. రాసిన వ్యక్తి సొంతంగా రాసినట్లు అనిపించట్లేదని, తీవ్రమైన ఒత్తిడి, బలప్రయోగం మధ్య రాసినట్లు ఉందని, చేతులు వణుకుతుండగా రాసినట్లు కనిపిస్తోందని, అక్షరాలు క్రమ పద్ధతిలో లేవని చెప్పింది. కాగితంపై పెన్ను ఒత్తిడి ఒక్కోచోట ఒక్కోలా ఉందన్నారు. పదాలు, వరుసల మధ్య పొంతన లేదని, అక్షరాల పరిమాణం అంతా ఒకేలా లేదని తెలిపారు. అక్షరాలు కొన్నిచోట్ల చిన్నవిగా, మరికొన్ని చోట్ల పెద్దవిగా ఉన్నాయని వివరించింది.

సంతకం కూడా సరిపోలలేదు ! 

వివేకానందరెడ్డి అసలైన సంతకంతో సరిపోల్చి చూసినప్పుడు లేఖలోని సంతకం భిన్నంగా ఉందని నివేదికలో తేలిందని సీబీఐ పేర్కొంది. ఆయన తన సంతకంలో తొలుత ఇంటిపేరు చేర్చి వై.ఎస్‌.వివేకానందరెడ్డి అని పెడతారని, కానీ లేఖలో వివేకానందరెడ్డి అని మాత్రమే అదీ అస్పష్టంగా ఉందని చెప్పింది. సృహలేని పరిస్థితుల్లో లేఖ రాసినట్లు అనిపిస్తోందని, ఆ లేఖ రాసినప్పుడు ఆయన స్వేచ్ఛగా లేరని.. ఆందోళన, ఒత్తిడి మధ్య ఉన్నారని, లేఖ అసంపూర్తిగా ఉందని చెప్పింది.

Published at : 07 Jun 2023 05:08 PM (IST) Tags: YS Avinash Reddy YS Viveka Case Viveka letter to nin hydrin test

ఇవి కూడా చూడండి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్

Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు

టాప్ స్టోరీస్

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా

Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా