By: ABP Desam | Updated at : 07 Jun 2023 03:30 PM (IST)
బ్రిటిష్ కాలం నాటి బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్
Postal Life Insurance Scheme: దేశంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను (Post Office Scheme) తీసుకువస్తూనే ఉంటుంది. వాటితో చాలా ప్రయోజనాలు పొందొచ్చు. పైగా, ఆ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి పెట్టుబడి నష్ట భయం ఉండదు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం
పోస్టాఫీసు అందిస్తున్న బెస్ట్ స్కీమ్స్‌లో ఒకటి "పోస్టల్ జీవిత బీమా పథకం" (PLI Scheme). ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ సహా చాలా బెనిఫిట్స్ కూడా అందుతాయి. ఆశ్చర్యకరంగా, ప్రభుత్వ బీమా పథకాల్లోనే అతి ఎక్కువ వయస్సున్న ప్రాచీన పథకం ఇది. బ్రిటిష్ పాలన కాలంలో, 1884 ఫిబ్రవరి 1న ఈ పథకం ప్రారంభమైంది.
పోస్టాఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. ఒకటి PLI, రెండోది RPLI. పీఎల్‌ఐ పథకం కింద 6 పాలసీలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ (whole life insurance policy). ఈ సంపూర్ణ జీవిత బీమా పాలసీ కింద, కనీస హామీ మొత్తం రూ. 20,000 - గరిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు చేతికి వస్తాయి. ఈ పథకం తీసుకున్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.
లోన్ కూడా తీసుకోవచ్చు
బీమా స్కీమ్ తీసుకున్న 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు ఈ పాలసీపై రుణం కూడా పొందవచ్చు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత, ఏ కారణం వల్లనైనా మీరు కొనసాగించలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. పాలసీని తీసుకున్న 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదు. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే, హామీ మొత్తంపై దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.
కనిష్ట - గరిష్ట వయో పరిమితి
PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in ని సందర్శించడం ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు, ఇదే సైట్ నుంచి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. లేదా, నేరుగా పోస్టాఫీసుకు వెళ్లిగానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం చెల్లింపు, రసీదు, ఆదాయపు పన్ను సర్టిఫికేట్ మొదలైనవన్నీ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:
పోస్టల్ జీవిత బీమా పాలసీని కనీసం 4 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
ఈ పాలసీతో సమ్ అజ్యూర్డ్ సౌకర్యం పొందుతారు.
బీమా చేసిన వ్యక్తికి/ అతను మరణిస్తే నామినీకి డబ్బు ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, పాలసీని సరెండర్ చేసే సౌలభ్యం ఉంది.
ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే తొలుత ఈ పాలసీని తీసుకువచ్చారు.
ఆ తర్వాత మార్పులు చేసి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: పూర్తి ఉచితంగా ఆధార్ అప్‌డేషన్, కొన్ని రోజులే ఈ ఆఫర్
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు