News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Aadhar: పూర్తి ఉచితంగా ఆధార్‌ అప్‌డేషన్‌, కొన్ని రోజులే ఈ ఆఫర్‌

మైఆధార్‌ (MyAadhaar) పోర్టల్‌లోకి వెళ్లి, డాక్యుమెంట్ అప్‌డేషన్‌ సౌకర్యాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు.

FOLLOW US: 
Share:

Aadhar Card Details Updation: ఇప్పుడు, మీ ఆధార్‌ కార్డ్‌లో పేరు, అడ్రస్‌ వంటి డిటైల్స్‌ మార్చాలనుకుంటే పూర్తి ఉచితంగా ఆ పని పూర్తవుతుంది. అయితే, ఈ ఆఫర్‌ ఇంకొన్ని రోజులే మిగిలుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ (UIDAI) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందారు.

ఈ నెల 14 వరకు ఫ్రీ
డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్లు మైఆధార్‌ (MyAadhaar) పోర్టల్‌లోకి వెళ్లి, డాక్యుమెంట్ అప్‌డేషన్‌ సౌకర్యాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. వాస్తవానికి ఈ  సదుపాయం 15 మార్చి 2023 నుంచే అమల్లోకి వచ్చింది, ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ గడువు వరకు, MyAadhaar పోర్టల్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ఒక్క రూపాయి కూడా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, అంటే ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలు అప్‌డేట్‌ చేయాలనుకుంటే మాత్రం గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత అప్‌డేషన్‌ సదుపాయం అందరికీ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకుని ఆ తర్వాత ఎప్పుడూ అప్‌డేట్ చేయని వాళ్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఉడాయ్‌ ఈ ఫెలిలిటీ తీసుకువచ్చింది. ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువును తిరిగి ధృవీకరించమని UIDAI కోరుతోంది. ఆధార్‌ కార్డ్‌ ఉన్న ఏ వ్యక్తి అయినా తన పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు. 

ఆధార్‌ కార్డ్‌ వివరాలను ఎలా అప్‌డేట్‌ చేయాలి?
పౌరులు https://myaadhaar.uidai.gov.in సైట్‌కు వెళ్లి తమ ఆధార్ నంబర్‌ ద్వారా లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని సంబంధింత గడిలో నింపి 'ఎంటర్‌' నొక్కాలి. ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ క్లిక్ చేయాలి. ఇప్పటికే ఉన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి. వివరాలను ఆధార్ హోల్డర్ ధృవీకరించాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటే, హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్‌లో, డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు ఎంచుకోవాలి, ఆయా పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్‌డేషన్‌ పూర్తయి, ఉడాయ్‌ ఆమోదించిన తర్వాత, గుర్తింపు రుజువు చిరునామా రుజువు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.

ఆధార్‌ కార్డ్‌లోని వివరాలను ఎందుకు అప్‌డేట్‌ చేయాలి?
భారత పౌరుడి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఆధార్‌ ఒకటి. ఆధార్‌ అంటే వట్టి సంఖ్య మాత్రమే కాదు, ఆ కార్డులో సదరు వ్యక్తి పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారంతో పాటు అతి కీలకమైన వేలిముద్రలు (బయోమెట్రిక్), కంటిపాపల (ఐరిస్‌) సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన పత్రం. వ్యక్తిగత గుర్తింపును నిరూపించుకోవాల్సిన ప్రతిచోటా దీని అవసరం ఉంటుంది. ఆధార్‌ లేకపోతే స్కూల్లో అడ్మిషన్‌ దొరకదు, బ్యాంక్‌ ఖాతా ఓపెన్‌ చేయలేం, ఉద్యోగంలో చేరలేం, ఏ ప్రభుత్వ పథకం అందదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్‌ కార్డ్‌ వివరాల్లో చిన్న తప్పు దొర్లినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల, ఆధార్‌లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం శ్రేయస్కరం. 

మరో ఆసక్తికర కథనం: ఇండియన్‌ మార్కెట్‌పై నాన్‌-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్‌ లిస్ట్‌ ఇదిగో 

Published at : 07 Jun 2023 12:57 PM (IST) Tags: UIDAI AADHAR Card aadhar Updation Free of cost MyAadhaar portal

ఇవి కూడా చూడండి

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది