అన్వేషించండి

FIIs: ఇండియన్‌ మార్కెట్‌పై నాన్‌-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్‌ లిస్ట్‌ ఇదిగో

మూడింట ఒక వంతు పైగా డబ్బును బ్యాంక్స్‌ & ఫైనాన్షియల్ స్టాక్స్‌లోకి పారించారు.

FIIs: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మీద ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) ప్రేమ డాలర్ల రూపంలో వర్షిస్తోంది. నాన్‌-స్టాప్‌ డాలర్ల వర్షానికి హెడ్‌లైన్ సూచీలు నిఫ్టీ & సెన్సెక్స్ ఆల్-టైమ్ హై లెవెల్స్‌ వరకు వెళ్లాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు మార్చి నుంచి ఇండియన్‌ స్టాక్స్‌ను యమా ఇంట్రెస్ట్‌గా కొంటున్నారు. 

మే నెలలో FII షాపింగ్ లిస్ట్‌
మే నెలలో, దలాల్ స్ట్రీట్‌లో ఫారినర్లు దాదాపు రూ.44,000 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మూడింట ఒక వంతు పైగా డబ్బును బ్యాంక్స్‌ & ఫైనాన్షియల్ స్టాక్స్‌లోకి పారించారు. ఆ ఒక్క నెలలోనే రూ. 17,671 కోట్లను బ్యాంక్స్‌ & ఫైనాన్షియల్ స్టాక్స్‌ కోసం వెచ్చించారు. మే నెలలో విదేశీయుల అతి పెద్ద పందెం ఇదే. ఆ తర్వాత ఆటో స్టాక్‌ కోసం రూ. 8,702 కోట్ల బెట్‌ కాశారు.

లిస్ట్‌లో టాప్‌లో ఇతర సెక్టార్లు... FMCG (రూ. 3,235 కోట్లు), హెల్త్‌కేర్ (రూ. 2,869 కోట్లు), కన్జ్యూమర్‌ సర్వీసెస్‌ (రూ. 2,865 కోట్లు), ఆయిల్ & గ్యాస్ (రూ. 2,729 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 2,505 కోట్లు).

MSCI ఇండియా ఇండెక్స్‌తో పోలిస్తే, FIIల పోర్ట్‌ఫోలియోలో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గత 6 నెలల సగటు వెయిటేజీ 7.83%. ఇప్పుడు కూడా 6.73% ఓవర్‌వెయిట్‌ కంటిన్యూ చేశారు. 

ఆటో సెక్టార్‌లో, FIIలు MSCIతో పోలిస్తే 1.57% అండర్‌ వెయిట్‌తో ఉన్నారు. గత 6 నెలల సగటు అండర్‌ వెయిట్‌ 1.26%. FII పోర్ట్‌ఫోలియోలో ఆటో సెక్టార్ వెయిటేజీ 2022 జూన్‌లోని 5.1% నుంచి పెరుగుతూ 2023 మేలో 6.3%కి చేరింది. మే ప్రారంభం నుంచి వెహికల్‌ స్టాక్స్‌ మీద FIIలు బలమైన ఆసక్తితో ఉన్నారు, ఒక బిలియన్ డాలర్లకు పైగా కొనుగోళ్లు చేశారు. దీంతో, ఆటో ఇండెక్స్ 11.5% లాభపడింది.

FIIలు వదిలించుకున్న స్టాక్స్‌
మే నెలలో ఎఫ్‌ఐఐ సేల్స్‌ లిస్ట్‌లో ఐటీ సెక్టార్‌ అగ్రస్థానంలో ఉంది. అయితే అమ్మకాల తీవ్రత బాగా తగ్గింది. ఏప్రిల్‌లో రూ. 4,908 కోట్ల విలువైన ఐటీ స్టాక్స్‌ను అమ్మితే, మే నెలలో రూ. 891 కోట్ల షేర్లు మాత్రమే విక్రయించారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం గత నెలలో 5.8 శాతం లాభపడింది.

గత నెలలో.. మీడియా, పవర్, మెటల్, కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌లోనూ నెట్‌ సెల్లర్స్‌గా ఉన్నారు.

2023లో క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు, విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా దాదాపు రూ. 36,000 కోట్ల విలువైన షేర్లు కొని నికర కొనుగోలుదార్లుగా (net buyers) ఉన్నారు.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్‌లో ఉంది! 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget