By: ABP Desam | Updated at : 07 Jun 2023 10:13 AM (IST)
గ్రే మార్కెట్‌లో షేర్లు దొరకట్లా
Tata Technologies IPO: ప్రస్తుతం IPO మార్కెట్ ఫుల్ డల్‌గా ఉంది. మంచి కాఫీ లాంటి IPO కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనం దొరికినట్లు, బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు టాటా టెక్నాలజీస్ IPO ఇప్పుడు ఎదురుగా కనిపిస్తోంది.
18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టాటా గ్రూప్ నుంచి రాబోతున్న IPO ఇది. మరో 5-6 నెలల్లో మార్కెట్‌లోకి అడుగు పెడుతుందని మార్కెట్ ట్రాకర్లు అంచనా వేశారు. టాటా టెక్నాలజీస్ IPOకి సంబంధించి రూల్స్ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవని, SEBI నుంచి ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ అందవచ్చని చెబుతున్నారు.
టాటా గ్రూప్ నుంచి చివరిసారిగా IPOకు వచ్చిన సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఇది 2004లో ఐపీఓకి వచ్చింది.
గ్రే మార్కెట్‌లో షేర్ ప్రైస్
అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో (అనధికార మార్కెట్ లేదా గ్రే మార్కెట్), టాటా టెక్నాలజీస్ షేర్లు రూ. 850 స్థాయిలో ట్రేడవుతున్నాయి. షేర్ ధర అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు కాబట్టి, షేర్ల సప్లై తగినంతగా లేదు.
"గ్రే మార్కెట్‌లో ఒక్కో షేర్‌ను రూ. 750 స్థాయి దగ్గర చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఒక దశలో షేర్ ప్రైస్ గరిష్టంగా రూ. 900కి కూడా చేరింది. ఈ స్టాక్ 20-30% ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు" - 'అన్‌లిస్టెడ్ అసెట్స్' కంపెనీ కో-ఫౌండర్ మనీష్ ఖన్నా
ఈ కంపెనీ గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్స్ మాన్యుఫాక్చరర్స్‌కు (OEMలు) టర్న్‌కీ సొల్యూషన్స్ సహా ఉత్పత్తుల అభివృద్ధి & డిజిటల్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ కంపెనీకి వివిధ దేశాల్లో ఉన్న 18 గ్లోబల్ డెలివరీ సెంటర్లలో 11,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి, ఈ ఏడాది మార్చి నెలలో ఐపీవో పేపర్లను టాటా టెక్నాలజీస్ సమర్పించింది. ప్రస్తుతం రెగ్యులేటర్ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది.
టాటా మోటార్స్‌కు 74.69% స్టేక్
టాటా టెక్నాలజీస్, ఒక గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ & డిజిటల్ సర్వీసెస్ కంపెనీ. టాటా మోటార్స్‌కు అనుబంధ సంస్థ. ఈ ఆటో మేజర్‌కు టాటా టెక్నాలజీస్‌లో ప్రస్తుతం 74.69% స్టేక్ ఉంది.
టాటా టెక్నాలజీస్ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో జరుగుతుంది, ఒక్క ఫ్రెష్ షేర్‌ను కూడా జారీ చేయడం లేదు. కంపెనీ ప్రమోటర్ ఎంటిటీ అయిన టాటా మోటార్స్ సహా ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు షేర్‌హోల్డర్లు వాళ్ల వాటాలను అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ IPO ద్వారా 9,57,08,984 ఈక్విటీ షేర్లను OFS ద్వారా అమ్ముతున్నారు, మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 23.60%కు సమానం.
OFS కింద, టాటా టెక్నాలజీస్ మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను లేదా కంపెనీలో 20% వాటాను ఆఫ్‌లోడ్ చేస్తుంది. ఇతర వాటాదార్లలో, ఆల్ఫా TC హోల్డింగ్స్ Pte 97.16 లక్షల షేర్లను (2.40%) విక్రయించాలని చూస్తోంది. టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-I 48.58 లక్షల ఈక్విటీ షేర్లను (1.20%) ఆఫ్‌లోడ్ చేస్తుంది. ప్రస్తుతం ఆల్ఫా TC హోల్డింగ్స్ Pteకి 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్-Iకు 3.63 శాతం వాటా ఉన్నాయి.
టాటా టెక్నాలజీస్ IPO సైజ్
IPO సైజ్ ఇంకా బయటకు రాలేదు. అయితే, టాటా టెక్నాలజీస్ ఇటీవలి చేపట్టిన షేర్ బైబ్యాక్ ప్రకారం కంపెనీ విలువ రూ. 16,080 కోట్లుగా టాటా టెక్నాలజీస్ పేర్కొంది. దీనిని బట్టి IPO సైజ్ కనీసం రూ. 3,800 - రూ. 4,000 కోట్లు ఉండవచ్చు.
2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 15% వృద్ధితో రూ. 3,052 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయంలో సేవల విభాగానిదే 88% వాటా. అదే కాలంలో, కంపెనీ నికర లాభం రూ.407 కోట్లుగా ఉంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ అక్కర్లేదు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే