అన్వేషించండి
Advertisement
Top Headlines Today: నేటి నుంచి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష, బైడెన్‌తో మోదీ భేటీ -మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 Headlines Today:
1. ఉత్తరాదిన జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. వైసీపీకి తలనొప్పిగా మారింది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుందని వైసీపీ చీఫ్ జగన్ చెప్పినా.. తప్పందా ఆ పార్టీదే అని పార్టీలు విమర్శిస్తున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు జరగకపోయినా.. ఉత్తరాదిన మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. దీంతో ఉత్తరాదిన జగన్ హిందూ వ్యతిరేకిగా మారిపోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. ఇండియా కూటమిలోకి కష్టమే..!
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఇది కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడిన బంధం కావడంతో ప్రస్తుతం జగన్ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లడం కష్టమే. కాంగ్రెస్ వైపు వెళ్లడం మంచిదనుకున్న వైసీపీకి.. ప్రస్తుత వివాదం ఊహించని కష్టాలను కూడా తెచ్చిపెట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. నేటి నుంచి పవన్ కల్యాణ్ దీక్ష
తిరుమల ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన ఘటనకు ప్రాయశ్చిత్తంగా నేటి నుంచి గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. నేడే జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య...ఆయన వియ్యంకుడితో కలిసి నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో జగన్‌పై రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు ఇచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. సీఎంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
అమృత్ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అమృత్ పథకంలో రూ. 8800 కోట్ల అవినీతి జరిగిందన్నారు. సీఎం రేవంత్ తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ పథకం టెండర్లను కేంద్రం రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్న కేటీఆర్.. ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతామన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం దంచికొట్టింది. ఎల్బీనగర్, వనస్థలి పురం, హయత్ నగర్ సహా పలు చోట్ల వాన కురిసింది. రహదారిపై నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. బైడెన్‌తో మోదీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. బైడెన్ నివాసంలో ఈ ఇద్దరు అగ్రనేతలు ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ కీలక భేటీలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై, చైనా అంశంపై సైతం వీరు చర్చించారని తెలుస్తోంది. బైడెన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. జమిలీ ఎన్నికలు అత్యంత ప్రమాదకరం
వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన వేళ... మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఈ ప్రతిపాదన లోపభూయిష్టంగా ఉందన్నారు. దేశానికి ఈ విధానం అవసరం లేదన్న కమల్ హాసన్... భవిష్యత్తులో కూడా ఇది అనవసరమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం
చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. బంగ్లాదేశ్ ముందు టీమిండియా కొండంత లక్ష్యాన్ని ఉంచింది. శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలతో కదం తొక్కడంతో రెండో ఇన్నింగ్స్ ను భారత జట్టు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని బంగ్లాదేశ్ ముందు టీమిండియా 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లా 357 పరుగులు వెనకపడి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10.చెన్నై టెస్టులో పంత్ శతక గర్జన
చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన పంత్ కేవలం 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు చేసిన పంత్.. ధోనీ సెంచరీల రికార్డును సమం చేశాడు. మొత్తంగా 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
తెలంగాణ
విశాఖపట్నం
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion