Weather Latest Update: రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
Weather Warnings: ఈరోజు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Weather Latest News: సెప్టెంబరు 22న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఎగువ గాలులలో కొనసాగిన ఆవర్తనం, ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, తూర్పు-పశ్చిమ గాలి విచ్చిన్నతి లో కేంద్రీకృతమై, మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించింది. దీని ప్రభావం వల్ల ఈనెల, అనగా సెప్టెంబర్ 23న వాయువ్య, దానిని పరిసర పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ రోజు ప్రధానంగా కింది స్థాయి గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉన్నది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం వుంది.
నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలుగా నమోదైంది. 90 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: అమరావతి వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు 23 నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉప సంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సగటు సముద్రం మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, గుణ, మాండ్రా, రాజ్ నంద్ గావ్, గోపాల్ పూర్, ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుంది.
తూర్పు- పశ్చిమ షియర్ జోన్తో అనుసంధానం అయి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో మధ్య ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయ్ లాండ్, పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉంది. తర్వాత ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సెప్టెంబరు 23 నాటికి వాయువ్య, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.