YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Andhra Pradesh : ఉమ్మారెడ్డి అల్లుడు కిలారు రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన ఆదివారమే జనసేన జెండా కప్పుకోనున్నారు.
Ummareddy son-in-law Kilaru Rosaiah will join the Janasena party : ఆదివారం జనసేన పార్టీలోకి వలసల వరద జరగనుంది. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేలోనే చేరేందుకు వైసీపీ నేతులు పెద్ద ఎత్తున రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారు కాకుండా... పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా జనసేనలో చేరేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఆదివారమే ఆయన పవన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. సామినేని ఉదయబాను కూడా అదివారమే జనసేనలో చేరనున్నారు.
ఇష్టం లేకపోయినా గుంటూరు ఎంపీ నుంచి పోటీ చేయించారని రోశయ్య అసంతృప్తి
కిలారు రోశయ్య వైసీపీ సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. గత ఎన్నికల్లో ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. 2019లో పొన్నూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ స్థానాన్ని అంబటి రాంబాబు సోదరుడికి ఇచ్చి.. కిలారు రోశయ్యకు మాత్రం గుంటూరు పార్లమెంట్ సీటు ఇచ్చారు. ఆయనకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా బలవంతంగా బరిలోకి దింపారు ఘోరపరాజయం ఎదురు కావడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత పార్టీకి రాజీననామా చేశారు. అప్పట్నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు.
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
ఇప్పటికే రాజీనామా - జనసేనలో చేరిక ప్రయత్నాలు సక్సెస్
అధికారంలో ఉన్నప్పటికీ ఐదేళ్ల పాటు పొన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయించడానికి నిధులు ఇవ్వలేదని.. పార్టీలో గౌరవం కూడా ఇవ్వలేదని కిలారు రోశయ్య చెబుతున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వయసు కారణంగా నేరుగా రాజకీయాల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ కారణంగా ఆయన కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణకు మొదటగా గుంటూరు పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు.ఆయన తనకు అవసరం లేదని.. తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్పి తప్పించుకున్నారు. ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ ఆయన జనసేనలో చేరేందుకు కిలారు రోశయ్య ప్రయత్నాలు చేశారు. చివరికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో పార్టీ మారిపోతున్నారు.
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
ఎలాంటి షరతులు లేకుండా జనసేనలో చేరిక
జనసేన పార్టీలో చేరే వారికి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా షరతులు పెట్టాలని అనుకుంటే.. చేరికలను ఆపేసి.. పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు. అధికారంలో ఉన్నారని సంపాదించుకుందామనో.. కేసులు నుంచి రక్షణ కోసమే పార్టీలో చేరే వారిని ఓ కంట కనిపెట్టి దూరంగా ఉంచాలని అనుకుంటున్నారు. అలాగే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసిన వారిని సైతం చెర్చుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.