అన్వేషించండి

Pawan Kalyan Deeksha: భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష

Pawan Kalyan Prayaschitha Deeksha | తిరుమల ప్రసాదాలలో కల్తీ జరగడంపై తీవ్ర మనోవేదన చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు.

AP Deputy CM Pawan Kalyan Taking Prayaschitha Deeksha for 11 days | అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలియగానే నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. అందులో భాగంగానే తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఆదివారం ఈ దీక్షను ప్రారంభింస్తారు.

22 సెప్టెంబర్  (ఆదివారం) నాడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఈ దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గత పాలకులు నీ పట్ల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవెంకటేశ్వరస్వామిని వేడుకుంటాను అన్నారు.

 భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే తిరుమల లాంటి ఆలయాలపై ఇలాంటి అకృత్యాలు చేస్తారంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రజలు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం ఇలాంటి తప్పిదాలను కనిపెట్టలేదు. ఒకవేళ గుర్తించినా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. గత వైసీపీ రాక్షస పాలకులకు భయపడి వారు మౌనంగా ఉన్నారేమోనని వ్యాఖ్యానించారు.

‘తిరుమల పవిత్రతకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా గత ప్రభుత్వం హిందూ ధర్మంపై చేసిన అపచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర మనోక్షోభకు గురి చేసింది. ధర్మం వైపు అడుగులు వేసే సమయం ఆసన్నమైంది. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకంగా మారుతోంది. ప్రజా క్షేమం కాంక్షించి నా వంతుగా ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నాను. ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: AP Floods: ఏపీలో వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, తేదీ ఫిక్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget