అన్వేషించండి

Canada: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రూబీ ధల్లా - బ్యాక్‌గ్రౌండ్ పవర్ ఫుల్ !

Canada Prime Minister Race: భారత సంతతికి చెందిన కెనడియన్ రాజకీయ నాయకురాలు రూబీ ధల్లా ప్రధానమంత్రి రేసులోకి వచ్చారు. లిబరల్ పార్టీ నాయకత్వం కోసం ఆమె పోటీ పడుతున్నారు.

Indian Origin Ruby Dhalla On Race For Canada Next Prime Minister: కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రదానమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ సాగుతోంది. పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తాయి. తాజాగా భారత సంతతికి చెందిన కెనడియన్ రాజకీయ నాయకురాలు రూబీ ధల్లా లిబరల్ పార్టీ నాయకత్వం కోసం పోటీ లోకి వచ్చారు. ఆమె  ఈ పోటీలో ముందడుగు వేస్తే కెనడాకు మొదటి సారి శ్వేత జాతీయేతర  నేత ప్రదాని అవుతారు. రూబీ దల్లా, వైద్యురాలు. విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. మూడు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచారు. సవాళ్లను ఎదుర్కొని కెనడాను సమర్థంగా ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం తనకు ఉందని రూబీ దల్లా చెబుతున్నారు.  

తన ప్రాధన్యతలుగా పెరుగుతున్న గృహ ఖర్చు, పెరుగుతున్న నేరాల రేట్లు, పెరుగుతున్న ఆహార ధరలు , US సుంకాల ముప్పు వంటి వాటిని గుర్తించారు.  కెనడా ఎదుర్కొంటున్న సుంకాల ముప్పులను చాలా తీవ్రమైనదని ఆమె భావిస్తున్నారు. ఇది కెనడా కార్మికులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని.. తక్షణం ఆ సమస్య నుంచి కెనడానికి బయటపడేయాల్సి ఉందని అంటున్నారు. కెనడాలో విన్నిపెగ్‌లో రూబీ దల్లా జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయ మూలాలున్నవారు. కెనడాలో ఎలా ఉన్నతమైనదో తనకు వచ్చిన అవకాశాలే చూపిస్తాయని ఆమె అంటారు. 1970లలో వలసదారులకు కెనడా తలుపులు తెరిచినందుకు ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడోకు ఆమె కృతజ్ఞతలు కూడా చెబుతూంటారు.  

1972లో తన తల్లి కెనడాకు వచ్చిందని రూబీ దల్లా చెబుతారు. కెనడాలో పుట్టి పెరిగిన రూబీ దల్లా పధ్నాలుగేళ్ల వయసు నుంచే లిబరల్ పార్టీతో కలిసి పని చేస్తున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు మూడు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై సమర్థమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.   'కెనడా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమవుతుంది' అనే నినాదాన్ని ఆమె వినిపిస్తున్నారు.   తన అంతర్జాతీయ అనుభవంతో, ప్రపంచ వేదికపై కెనడా ఖ్యాతిని పెంచుతానని ఆమె హామీ ఇస్తున్నారు. ఇతర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రూడో ఇతర దేశాలతో పెట్టుకున్న కయ్యాల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ..తాను అలాంటి పని చేయనని అంటున్నారు.  

 కెనడా ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం రూబీ దల్లా రేసులోకి వచ్చారు. ఆమెకు మద్దతు లభిస్తే చరిత్ర సృష్టిస్తారు.                    

టాప్ హెడ్ లైన్స్

US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Prince Williams Batting: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
Xi Trump Putin summit: జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget